Movie News

ధనుష్ దగ్గర రూ.60 కోట్ల వాచీలు

ధనుష్ సినీ రంగంలోకి రావడానికి ముందే అతడి తండ్రి తమిళ పరిశ్రమలో చిన్న స్థాయి దర్శకుడు. అలా అని దాని వల్లేమీ కోలీవుడ్ అతడికి రెడ్ కార్పెట్ పరచలేదు. తొలి చిత్రం ‘తుళ్ళువదో ఎలమై’లో అతడి పాత్ర, లుక్స్ చూసి ఇతనేం హీరో అనే అన్నారు. ఆ సినిమాను అనేక కష్టాలు పడి ధనుష్ ఫ్యామిలీనే పూర్తి చేసింది. ఆ సినిమా సెన్సేషనల్ హిట్టయినా ధనుష్‌కు పెద్దగా పేరు రాలేదు.

కానీ తన అన్న సెల్వ రాఘవన్‌తో చేసిన ‘కాదల్ కొండేన్’ బ్లాక్ బస్టర్ కావడమే కాక.. నటుడిగా కూడా అతడికి గొప్ప పేరు రావడంతో కెరీర్ మారిపోయింది. ఆ తర్వాత అనేక అద్భుతమైన సినిమాలు, పాత్రలతో ధనుష్ దేశంలోనే గొప్ప నటుల్లో ఒకడిగా పేరు సంపాదించాడు. ఇప్పుడతను సినిమాకు రూ.40-50 కోట్ల మధ్య పారితోషకం తీసుకునే స్థాయికి ఎదిగాడు. నటుడిగానే కాక దర్శకుడిగానూ అతను విజయాలు అందుకుంటున్నాడు.

మిడిల్ క్లాస్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ధనుష్ ఇప్పుడు ఏడాది వ్యవధిలో అత్యధిక ఆదాయం పొందే నటుల్లో ఒకడిగా ఎదిగాడు. చిన్నప్పుడు తన తల్లి వంద రూపాయల వాచీ కొని ఇచ్చినపుడు కలిగిన ఆనందం గురించి అతను ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. తనకు వాచీలంటే పిచ్చి అని.. తల్లి కొనిచ్చిన ఆ వాచీని ఇప్పటికీ దాచి పెట్టుకున్నానని ధనుష్ వెల్లడించాడు. తాను స్టార్‌గా ఎదిగాక కోట్ల రూపాయలు పెట్టి వాచీలు కొనుక్కోవడం అలవాటుగా మారిందట.

తాను పాల్గొన్న ఇంటర్వ్యూలో పెట్టుకున్న వాచీ ఖరీదు రూ.2.5 కోట్లని అతను వెల్లడించాడు. ఎప్పట్నుంచో ఇలా లగ్జరీ వాచీలను సేకరించడం అలవాటుగా మారిందని అతను తెలిపాడు. ఇప్పుడు ధనుష్ దగ్గర ఉన్న వాచీల విలువ మాత్రమే రూ.60 కోట్ల దాకా ఉండొచ్చని తన సన్నిహితుల సమాచారం. మరి సినిమాకు రూ.50 కోట్ల దాకా పారితోషకం తీసుకుంటున్నపుడు రెండున్నర కోట్ల రూాపాయల వాచీ కట్టుకోవడం.. వాచీల కలెక్షన్ రూ.60 కోట్ల దాకా ఉండడం పెద్ద విషయం కాదు. ఇదంతా ధనుష్ కేవలం తన కష్టంతో సంపాదించుకున్నదే కాబట్టి ఈ లగ్జరీలను ఎంజాయ్ చేయడానికి అతను అర్హుడు.

This post was last modified on November 25, 2025 11:46 am

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

2 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

5 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

6 hours ago