ఇండియాస్ మోస్ట్ వెయిటింగ్ ప్రాజెక్టుగా చెప్పబడుతున్న వారణాసి మీద ట్రైలర్ లాంచ్ తర్వాత అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ బాబు షాట్ తప్ప మిగిలినదంతా సిజిలో చేసిన వర్క్ కావడంతో అసలు విజువల్స్ ఇంకే స్థాయిలో ఉంటాయోనని అభిమానులు అంచనాలను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా మాట్లాడుతూ వారణాసిలో ఆరు పాటలు ఉంటాయని, చాల అద్భుతంగా వస్తున్నాయని చెప్పారు. వాటి వివరాలు, సందర్భాలు చెప్పలేదు కానీ మాటలను బట్టి ఇంటర్నేషనల్ ఆల్బమ్ అయితే రెడీ అవుతోంది.
ఇది ఓకే కానీ ఆల్రెడీ బయటికి వచ్చేసిన సంచారి, కుంభ థీమ్ సాంగ్ వారణాసి లిస్టులో భాగంగా ఉంటాయా లేక విడిగానా అనేది తెలియాల్సి ఉంది. పృథ్విరాజ్ సుకుమారన్ కు పెట్టిన పాట కన్ఫర్మ్ గా ఉంటుంది ఎటొచ్చి సంచారి మీద అనుమానాలున్నాయి. ఈవెంట్ కోసం రాజమౌళి దాన్ని ప్రత్యేకంగా కంపోజ్ చేయించారని చెప్పారు కానీ స్టేజి మీద శృతి హాసన్ తో పాడించడం తప్ప ఎక్కువ హైలైట్ చేయలేదు. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ తర్వాత సినిమా కావడంతో రాజమౌళి మ్యూజిక్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. నాటునాటుని మించిన అవుట్ ఫుట్ కీరవాణితో చేయించుకోవాలి.
2027 వేసవిలో విడుదల కాబోతున్న వారణాసి చుట్టూ ఇంకా వివాదాలు సమిసిపోలేదు. హనుమంతుడి మీద కామెంట్స్ కేసులు, టైటిల్ కాంట్రవర్సి వగైరాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకునేందుకు టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. ఇకపై ప్రమోషన్లకు రాజమౌళి ఎక్కువ గ్యాప్ ఇవ్వబోతున్నారు. మహేష్, పృథ్విరాజ్, ప్రియాంకా చోప్రా లుక్స్ ఎలాగూ రివీల్ చేశారు. టైటిల్ ట్రైలర్ జనంలోకి వెళ్ళిపోయింది.. సో ఇక పబ్లిసిటీ అక్కర్లేదు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మీద ఫోకస్ పెట్టొచ్చు. అన్నట్టు మహేష్, ప్రియాంకా చోప్రాల మీద డ్యూయెట్లు లాంటి రెగ్యులర్ స్టఫ్ ఇందులో ఉండవట. ఆర్ఆర్ఆర్ కు ఫాలో అయిన పద్ధతినే వారణాసికి వాడతారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates