ఓజి మేనియాని బాగా ఎంజాయ్ చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూపులు నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఉన్నాయి. తేరి రీమేక్ అనే ముద్రతో మొదలుపెట్టి గబ్బర్ సింగ్ దర్శకుడు మళ్ళీ మేజిక్ చేస్తాడనే నమ్మకం క్రియేట్ అయ్యేదాకా మధ్యలో చాలా పరిణామాలు జరిగాయి. ఒకవేళ ఓజి ఫెయిలయ్యుంటే ఉస్తాద్ గురించి ఇంత టాపిక్ వచ్చేది కాదేమో కానీ ఇప్పటికైతే క్రమంగా హైప్ పెరుగుతున్న మాట వాస్తవం. డిసెంబర్ లో ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తామని ఇటీవలే అల్లరి నరేష్ 12 ఏ రైల్వేకాలనీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అసలు ప్రశ్న రిలీజ్ డేట్ ఎప్పుడు.
మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ దానికి క్లారిటీ ఇచ్చేశారు. ఆంధ్రకింగ్ తాలూకా ప్రెస్ మీట్ బెంగళూరులో నిర్వహించినప్పుడు అక్కడ ఎదురైన ప్రశ్నల్లో భాగంగా సమాధానం ఇచ్చారు. రామ్ చరణ్ పెద్ది మార్చిలో, ఉస్తాద్ భగత్ సింగ్ ఏప్రిల్ లో విడుదలవుతాయని చెప్పేశారు. అంటే అబ్బాయి తర్వాతే బాబాయి వస్తారనేది కన్ఫర్మ్. డేట్ ఇంకా లాక్ చేయలేదు కానీ బహుశా టీజర్ టైంకి ఫిక్స్ చేయొచ్చు. అదే సమ్మర్ లో చిరంజీవి విశ్వంభర ఉన్న నేపథ్యంలో దాంతో క్లాష్ లేకుండా పవన్ మూవీకి డేట్ ఫిక్స్ చేస్తారు. విఎఫెక్స్ పనుల వల్ల మెగా మూవీకి ఎప్పుడు మోక్షం దక్కుతుందో అంతు చిక్కడం లేదు.
కథ ఇక్కడితో అయిపోలేదు. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు కూడా సమ్మర్ నే టార్గెట్ చేసుకుంటున్నాయి. సో పరస్పరం తలపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత నిర్మాతల మీద ఉంది. హైప్ పరంగా పెద్ది అన్నింటి కన్నా పైన ఉంది. టీజర్, చికిరి చికిరి సాంగ్ రెండూ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చే కంటెంట్ కూడా ఇదే స్థాయిలో ఉంటుందని, దేవిశ్రీ ప్రసాద్ ఆ స్థాయిలో పాటలు ఇచ్చాడని యూనిట్ అంటోంది. వీళ్ళ కన్నా ముందు మన శంకరవరప్రసాద్ గారు ఎలాగూ వచ్చేస్తున్నారు. హిట్టు బోణీ కొడితే మిగిలిన మెగా హీరోస్ కు బూస్ట్ అవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates