‘వారణాసి’ (SSMB29) ఈవెంట్‌లో రాజమౌళి చూపించిన కాన్సెప్ట్ వీడియో, సినిమా అసలు కథ ఏంటో లీక్ చేసింది. ఇది కేవలం కాశీలో జరిగే కథ కాదని, ఖండాలు, యుగాలు దాటి సాగే ఒక గ్లోబల్ అడ్వెంచర్ అని ఈ విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ స్కేల్ చూసి ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ అవుతోంది. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఫొటోల్లోని లొకేషన్లు చూస్తే, ఇది అసలైన ‘గ్లోబ్ ట్రాటర్’ అని అర్థమవుతోంది. ‘అంటార్కిటికా’లోని మంచు పర్వతాలు, ‘ఆఫ్రికా’లోని అడవులు.. ఇలా మహేష్ బాబు పాత్ర ప్రపంచం చుట్టూ ఏదో రహస్యం కోసం వెతుకుతున్నట్లు హింట్ ఇస్తున్నాయి. ఇది పక్కా హాలీవుడ్ ‘ఇండియానా జోన్స్’ రేంజ్ అడ్వెంచర్ అని ఈ రెండు లొకేషన్లు కన్ఫర్మ్ చేశాయి.
ఈ అడ్వెంచర్‌కు మూలం మాత్రం ఇండియానే. ‘వానాంచల్’లోని ‘ఉగ్రభట్టి కేవ్’ మిస్టరీని పెంచుతుండగా, అన్నింటికంటే పెద్ద షాక్ “త్రేతాయుగం లంకా నగరం..7200 BCE” అనే ఫ్రేమ్. ఇది కథ మూలాలను ఏకంగా 7,200 ఏళ్ల వెనక్కి, రామాయణ కాలానికి తీసుకెళ్లింది. ఇది చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక రాముడిగా మహేష్ కనిపించనున్నట్లు జక్కన్న ఈవెంట్ లోనే క్లారిటీ ఇచ్చాడు.
దీన్నిబట్టి, త్రేతాయుగంలో ‘లంక’లో జరిగిన సంఘటనకు, ప్రస్తుత ‘వారణాసి’కి లింక్ ఉందని విజువల్స్ తో ఓ క్లారిటీ ఇచ్చాడు. ‘మణికర్ణిక ఘాట్’ నుంచి ఆకాశంలోకి వెళ్తున్న ఆ పవర్‌ఫుల్ లైట్ బీమ్, ఆ పురాతన రహస్యానికి సంబంధించిన ఎనర్జీ సోర్స్ కావచ్చు. ఆ సోర్స్ కోసమే ఈ గ్లోబల్ వేట సాగుతుందని టాక్.
రాజమౌళి ఈసారి మైథాలజీ (లంక), అడ్వెంచర్ (ఆఫ్రికా), స్పిరిచువాలిటీ (వారణాసి) మూడింటినీ మిక్స్ చేస్తున్నాడు. ‘వారణాసి’ని కేంద్రంగా చేసుకుని, త్రేతాయుగం నాటి రహస్యాన్ని ఛేదించే ఈ కథాంశం.. ‘RRR’ను మించిన అంచనాలను క్రియేట్ చేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates