జీహెచ్‍ఎంసీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి బేషరతు మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్‍ని ప్రకాష్‍రాజ్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. పవన్ ధోరణి బాలేదంటూ బాహాటంగానే ప్రకాష్‍రాజ్ విమర్శలు గుప్పించాడు. అంతే కాదు, టీఆర్‍ఎస్‍కు ఓటు వేయాలంటూ విజ్ఞప్తి కూడా చేసాడు. ప్రకాష్‍రాజ్ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు మండిపడ్డాడు. అతడిని చెడామడా తిట్టి పారేసాడు.
ఇంతకీ మేటరేంటంటే ఇప్పుడు వీరిద్దరూ ఒకే సెట్లో ఎదురెదురుగా నిలబడి షూటింగ్ చేయాల్సి వుంది. పవన్‍కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో అవతలి లాయర్ పాత్రను ప్రకాష్‍రాజ్ చేస్తున్నాడు. ఇప్పటికే పలు సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిపోయింది. ఇంకా కొన్ని సీన్స్ తీయాల్సి వుంది. మరి ప్రకాష్‍రాజ్‍తో కలిసి నటించడానికి పవన్‍కళ్యాణ్ అంగీకరిస్తాడా?
వీళ్లిద్దరూ షూట్‍లో వున్నపుడు అక్కడి సిట్యువేషన్‍ని దిల్ రాజు ఎలా హ్యాండిల్ చేస్తాడు. రాజకీయం రాజకీయమే, నటన నటనే అని ఇద్దరూ అనుకుంటే బాగానే వుంటుంది కానీ ఇద్దరి స్వభావం అలాంటిది కాదు కనుక వీళ్లిద్దరితో షూట్ ప్లాన్ చేస్తోన్న వకీల్ సాబ్ టీమ్ కాస్త టెన్షన్ పడుతోంది. మరి ఎలాంటి రగడ లేకుండా దీనిని ఎలా ముగిస్తారనేది వేచి చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates