సినీ రంగ ప్రవేశం చేస్తుందో లేదోననే డౌట్ వున్నపుడు మీడియాలో ప్రతి రోజూ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించిన వార్తలు వచ్చేవి. ఆమె కనుక హీరోయిన్ అయితే తల్లి మాదిరిగా సెన్సేషన్ అయిపోతుందని ఊదరగొట్టేసే వారు. ఆమె లాంఛ్ బ్రహ్మాండంగా వుండాలని శ్రీదేవి కూడా చాలా ప్లాన్ చేసింది.
చివరకు కరణ్ జోహార్‍కు ఆమెను లాంఛ్ చేసే బాధ్యతలు అప్పగించగా అతడు ఆమెను కమర్షియల్ సినిమాతో కాకుండా లో బడ్జెట్ టీనేజ్ లవ్‍స్టోరీతో పరిచయం చేసాడు. ఆ తర్వాత గుంజన్ సక్సేనా లాంటి హీరోయిన్ ప్రధాన చిత్రం చేయించాడు. హీరోయిన్ అయి ఇంతకాలమయినా కానీ జాన్వీకి పేరున్న హీరోల పక్కన నటించే అవకాశం దక్కలేదు.
ఆలియా భట్ లాంటి వాళ్లు చాలా వేగంగా స్టార్స్ అయిపోగా, జాన్వీ మాత్రం ఇంకా సరయిన సినిమా పడక బి లిస్ట్ హీరోయిన్‍గానే కొనసాగుతోంది. ఆమె తదుపరి చిత్రంలో కూడా హీరో వుండడట. నయనతార నటించిన కొలమావు కోకిల అనే తమిళ చిత్రం రీమేక్‍లో జాన్వీ నటిస్తుందట. ముప్పయ్యేళ్లు దాటిన తర్వాత నయనతార చేసిన క్యారెక్టర్‍ని ఇరవయ్యేళ్ల జాన్వీ అప్పుడే చేసేస్తోంది. ఆమె కెరియర్ ఇలాగే ముందుకు సాగితే బాలీవుడ్‍లో పెద్ద రేంజ్‍కి చేరుకోవడం కష్టమే అనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates