సౌత్ ఇండియాలో ఆన్ లైన్ ఫ్యాన్ వార్స్ అత్యధికంగా జరిగేది తెలుగు సినీ అభిమానుల మధ్యే అంటే ఆశ్చర్యపడాల్సిన పనేమీ లేదు. తమిళంలో, కన్నడలో కూడా మన వాళ్లకు దీటుగా అక్కడి అభిమానులు సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తుంటారు. వీళ్లకు పెద్ద కారణం ఏమీ అక్కర్లేదు. ఒక హీరో అభిమాని.. ఇంకో హీరో అభిమానులను కవ్వించేలా ఒక పోస్టు పెడతాడు. వాళ్లు రెచ్చిపోతారు.
చిన్న చిన్న టాపిక్స్ మీద రోజుల తరబడి ముష్టియుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ల మధ్య ఈ వార్స్‌కు దారి తీసే కారణాలు చూస్తే ఇలాంటి వాటి మీద కూడా గొడవపడతారా అని ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలు దాటిపోయి.. వేరే ఇండస్ట్రీకి చెందిన హీరోల అభిమానులతో కూడా గొడవలు పడుతుంటారు. తమ హీరోలు గొప్ప అంటే తమ హీరోలు గొప్ప అంటూ ఈ గొడవలు సాగుతుంటాయి.
టాలీవుడ్ అభిమానులతో వేరే ఇండస్ట్రీల వాళ్లకు తరచుగా ఒక టాపిక్ మీద గొడవ జరుగుతుంటుంది. తెలుగు నుంచి వేరే భాషల్లోకి రిలీజైన బ్లాక్‌బస్టర్ చిత్రాలను పట్టుకుని.. బెటర్ దన్ ద ఒరిజినల్ అంటూ టెంప్లేట్స్ వేస్తుంటారు అక్కడి ఫ్యాన్స్. గత కొన్ని రోజులుగా ఈ టాపిక్కే సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. రోజుల తరబడి దీని మీద ఇంటర్ స్టేట్ ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్‌కు చెందిన విజయ్ అభిమానులు ఈ విషయంలో చేసే అతి అంతా ఇంతా కాదు.
మహేష్ బాబు ఒక్కడు, పోకిరి చిత్రాల కంటే విజయ్ నటించిన వాటి రీమేక్స్ గిల్లి, పోకిరి చిత్రాలు సూపర్ అంటూ కొట్లాటకు వస్తుంటారు అక్కడి ఫ్యాన్స్. కానీ పక్కపక్కన రెండు సినిమాల్లోని సన్నివేశాలను పెట్టి చూస్తే.. విజయ్ లుక్స్, తన పెర్ఫామెన్స్ తేలిపోతుంటాయి. రీమేక్‌ల్లోని కొన్ని సీన్లు మరీ కామెడీగా అనిపిస్తాయి కూడా. అయినా అతను, తన సినిమాలే గొప్ప అని అడ్డంగా వాదిస్తుంటారు తమిళ అభిమానులు. మరీ విడ్డూరం ఏంటంటే.. ‘3 ఇడియట్స్’ లాంటి క్లాసిక్ కంటే కూడా విజయ్ చేసిన ‘నన్బన్’ బెటర్ అనడం. ఆమిర్ ముందు విజయ్ పెర్ఫామెన్స్ వెలవెలబోతుందని తమిళనాడు అవతల ఎవ్వరిని అడిగినా చెబుతారు. కానీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం ‘నన్బన్’ గ్రేట్ అంటారు.
అంతే కాక రవితేజ ‘విక్రమార్కుడు’ కంటే కార్తి ‘సిరుత్తై’ సూపర్ అని కూడా తమిళ అభిమానులు వాదిస్తుంటారు. ఎన్టీఆర్ ‘బృందావనం’ కంటే కన్నడ స్టార్ ‘బృందావనం’ గ్రేట్ అంట. రామ్ చరణ్ ‘మగధీర’ కంటే యశ్ ‘గజకేసరి’ బెటరంట. కానీ ఆయా చిత్రాల్లోని కీలక సన్నివేశాలను పక్కపక్కన పెట్టి చూస్తే తెలుగు సినిమాల ఇంపాక్ట్ ముందు.. అవి తుస్సుమనిపిస్తుంటాయి. అయినా సరే అవే సూపర్ అని అక్కడి వాళ్లు చంకలు గుద్దుకోవడం విడ్డూరం.
This post was last modified on October 16, 2025 5:04 pm
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…