మన శంకరవరప్రసాద్ గారు నుంచి మీసాల పిల్ల ప్రోమో వచ్చినప్పుడు పాజిటివ్ తో పాటు నెగటివ్ కామెంట్స్ బాగానే వినిపించాయి. ఫుల్ సాంగ్ వచ్చాక కూడా ఇవి కొనసాగాయి. బ్యాక్ గ్రౌండ్ విఎఫ్ఎక్స్ లా ఉందని, గోదారి గట్టు మీద రేంజ్ లో పాట లేదని ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అనిల్ రావిపూడి టేస్టుని తక్కువంచనా వేసిన వాళ్లే ఎక్కువ. రెండు రోజులు గడవడం ఆలస్యం అప్పుడే పదహారు మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోవడంతో పాటు ప్రస్తుతం టాప్ వన్ ట్రెండింగ్ లో ఉంది. భీమ్స్ సిసిరోలియో ట్యూన్, భాస్కర భట్ల సాహిత్యం రెండూ బాగా రీచ్ అవుతున్నాయి.
ఇలాంటి పాటలకు రీచ్ ఎంత వచ్చిందనే దానికి ఆధారం సోషల్ మీడియా. ముఖ్యంగా రీల్స్ ఎన్ని వేల లక్షలు వచ్చాయనే దాన్ని బట్టి ఓపెనింగ్స్ మీద ఒక అవగాహనకు వచ్చే ప్రొడ్యూసర్లు, దర్శకులు చాలా ఉన్నాయి. అయితే ఇది చిరంజీవి సినిమా కాబట్టి ఎలా ఓపెన్ అవుతుందనే అనుమానం ట్రేడ్ లో లేదు కానీ సామాన్య ప్రేక్షకుల్లో ఆసక్తి కలగాలంటే వైరల్ కంటెంట్ అవసరం చాలా ఉంటుంది. ప్రస్తుతం మీసాల పిల్ల అదే పనిలో ఉంది. చిరు గ్రేస్, నయనతార కెమిస్ట్రీ కొన్ని బలహీనతలను కవర్ చేస్తున్నాయి. ఇది ఖరీదైన ఇంటీరియర్ లో కాకుండా బయట తీసుకుంటే ఇంకా ఇంపాక్ట్ వచ్చేదేమో.
మొదటి పరీక్షలో మన శంకరవరప్రసాద్ గారు పాసైపోయారు. అయితే ఇన్ సైడ్ టాక్ ఏంటంటే ఆల్బమ్ లో స్లోగా ఉన్న పాట ఇదేనని , మిగిలినవి ఫుల్ జోష్ తో ఉంటాయని, ముఖ్యంగా చిరంజీవి వెంకటేష్ కలిసి ఉన్న సాంగ్, సోలోగా చిరు చేసిన పాట ఒకదాన్ని మించి మరొకటి ఫ్యాన్స్ కి కనువిందు చేయడం ఖాయం అంటున్నారు. ఇంకో రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఒక్కొక్కటిగా రిలీజ్ చేసేందుకు అనిల్ రావిపూడి ప్లానింగ్ లో ఉన్నాడు. సంక్రాంతి రిలీజ్ ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదనే ఉద్దేశంతో పని చేస్తున్న టీమ్ జనవరి 12, 14 రెండు డేట్లను పరిశీలనలో ఉంచింది. ఇంకా ఫైనల్ చేయలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates