రెండేళ్ల క్రితం వరకు నెట్ ఫ్లిక్స్ అంటే కేవలం ఫారిన్ కంటెంట్ చూసే ఒక ఖరీదైన ప్లాట్ ఫార్మ్ గా మాత్రమే భారతీయులకు పరిచయం. నిజంగానే దాని సరుకు అలాగే ఉండేది. కానీ అలా పరిమితులు పెట్టుకోవడం వల్ల ఇండియన్ మార్కెట్ తమకు పెరగదని గుర్తించిన యాజమాన్యం రీజనల్ సినిమాలు, వెబ్ సిరీస్ మీద సీరియస్ గా దృష్టి పెట్టింది. దానికోసం వందలు కాదు వేల కోట్ల పెట్టుబడులను సిద్ధం చేసుకుంది. అందుకే సరిపోదా శనివారం, హిట్ 3, దేవర, పుష్ప 2, టిల్లు స్క్వేర్, గుంటూరు కారం, సలార్, వాల్తేర్ వీరయ్య లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకుంది. హక్కుల కోసమే ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేసింది.
తాజాగా నెట్ ఫ్లిక్స్ స్ట్రాటజీ మారుతున్నట్టు కనిపిస్తోంది. థియేటర్లలో ఆడిన సినిమాలను అంతేసి సొమ్ములు పోసి కొనడం కంటే మనమే తీస్తే పోలా అంటూ క్రేజీ కాంబినేషన్లతో స్వంతంగా టై అప్స్ చేసుకుంటోంది. అందులో భాగంగా పూర్తయిన ఆరు తెలుగు, తమిళ సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజులను ప్రకటించింది. సందీప్ కిషన్ టైటిల్ రోల్ పోషించిన ‘సూపర్ సుబ్బు’ వాటిలో మొదటిది. టిల్లు స్క్వేర్ ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకుడు. ఆనంద్ దేవరకొండ నటించిన ‘తక్షకుడు’ని సితార ప్రొడ్యూస్ చేయడం విశేషం. మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ వినోద్ అనతోజు ఈసారి వయొలెంట్ రూట్ తీసుకున్నాడు. ఓజి భామ ప్రియాంక మోహన్ నటించిన ‘మేడ్ ఇన్ కొరియా’ అన్ని భాషల్లో రానుంది.
మాధవన్ ప్రధాన పాత్ర పోషించిన లెగసి, అర్జున్ దాస్ – ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన లవ్, గోమతి శంకర్ టైటిల్ రోల్ పోషించిన క్రైమ్ థ్రిల్లర్ స్టీఫెన్ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇవన్నీ వివిధ నిర్మాణ సంస్థలు తీసిన సినిమాలు, సిరీస్ లే. అయినప్పటికీ థియేటర్ కోసం కాదు. ఎక్స్ క్లూజివ్ గా నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం చేసుకుని వాళ్ళ ప్లాట్ ఫార్మ్ కోసం రూపొందించినవి. జానర్స్ దేనికవే విభిన్నంగా కనిపిస్తున్నాయి. ఓటిటి మార్కెట్ మసకబారి థియేటర్ బిజినెస్ ఊపందుకుంటున్న టైంలో నెట్ ఫ్లిక్స్ వేస్తున్న కొత్త ఎత్తుగడ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ఇవి కాకుండా ప్రొడక్షన్ లో ఉన్నవి చాలా ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates