Movie News

సొంతంగా టైటిల్ పెట్టుకున్న రవితేజ

సాధారణంగా కథ రాసిన రచయిత లేదా సినిమా తీసిన దర్శకుడు టైటిల్ కూడా పెడుతుంటారు. కొన్నిసార్లు మాత్రం హీరోనో, నిర్మాతో పేరు సూచిస్తుంటారు. అది అందరికీ ఆమోదయోగ్యం అయితే కన్ఫమ్ అవుతుంది. తన కొత్త చిత్రం ‘మాస్ జాతర’కు స్వయంగా హీరో రవితేజే టైటిల్ పెట్టాడట. ఈ విషయాన్ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న భాను భోగవరపు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

రవితేజకు తొలిసారి ఈ కథ చెప్పినపుడు ఇందులో మాస్ అంశాలు బాగా నచ్చి, తనకు బాగా సూటయ్యే సినిమా అని భావించిన రవితేజ.. నరేషన్ అవ్వగానే ‘మాస్ జాతర’ అంటూ టైటిల్ సూచించాడట. తనకు అది కూడా బాగా నచ్చడంతో ఆ టైటిలే కన్ఫమ్ చేశానని భాను తెలిపాడు. ఐతే ఈ టైటిల్‌కు పెట్టిన క్యాప్షన్ మాత్రం తన క్రెడిటే అని భాను తెలిపాడు. 

కానీ ‘మనదే ఇదంతా’ అనే క్యాప్షన్ చెప్పినపుడు రవితేజ అది వద్దు అని అన్నాడట. ఐతే ముందు పెట్టి చూద్దాం, తర్వాత వద్దనుకుంటే తీసేద్దాం అని భాను చెప్పగా.. రవితేజ సరే అని చెప్పాడట. చివరికి ఆ క్యాప్షన్ కూడా బాగుందని దాన్ని ఖరారు చేశారట. ఈ చిత్రంలో రవితేజ రైల్వే పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. 

ఈ సినిమాలో తన భాష, యాస, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటాయని దర్శకుడు, హీరోయిన్ శ్రీలీలతో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో రవితేజ వెల్లడించాడు. తాను ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అవీ బాగానే ఫాలో అవుతానని.. వాటిని ఎంజాయ్ చేస్తానని.. కానీ ట్విట్టర్‌ అంటే మాత్రం నచ్చదని రవితేజ తెలిపాడు. ఇక్కడంతా నెగెటివిటీనే ఉంటుందని.. ఈ బ్యాచ్ అంతా వేరే అని, అందుకే తాను ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండనని రవితేజ తెలిపాడు. ‘మాస్ జాతర’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on October 7, 2025 9:04 pm

Share

Recent Posts

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

2 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

3 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

3 hours ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

3 hours ago

త్రివిక్రమ్ బాధ్యత గురించి భేతాళ ప్రశ్న

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…

4 hours ago

రియాలిటీకి దగ్గరగా ఉన్నా కామెంట్స్ తప్పలేదు

నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…

4 hours ago