గత ఏడాది శాండల్ వుడ్ నే కాదు అన్ని పరిశ్రమలను కుదిపేసిన వార్త కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్. స్వంత అభిమాని రేణుక స్వామిని హత్య చేసిన కేసులో ఇప్పటికీ జైలులోనే ఉన్న దర్శన్ ఆ మధ్య బెయిల్ తెచ్చుకున్నాడు కానీ ఆగస్ట్ లో సుప్రీమ్ కోర్టు దాన్ని రద్దు చేయడంతో మళ్ళీ కటకటాలపాలయ్యాడు. ఆధారాలు బలంగా ఉండటంతో బయటపడే మార్గాలు చాలా క్లిష్టంగా ఉన్నాయి. హతుడి కుటుంబం తమకు న్యాయం జరగాలని పట్టుదలతో పోరాడుతూ ఉండగా ప్రభుత్వం వైపు నుంచి కూడా మద్దతు లభించడంతో దర్శన్ ఎప్పుడు వస్తాడో, లేదా నేరం ఋజువై శిక్ష అనుభవిస్తాడో సస్పెన్స్ గా మారింది.
ఇదిలా ఉండగా దర్శన్ కొత్త సినిమా డెవిల్ విడుదలకు రెడీ అవుతోంది. నిర్మాతలు డేట్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 12 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టనుందని ప్రకటన ఇచ్చారు. మొదటి ఆడియో సింగల్ ఇంతకు ముందే వచ్చేయగా రెండో లిరికల్ వీడియో త్వరలో వదలబోతున్నారు. నిజానికి దర్శన్ జైలుకు వెళ్ళడానికి ముందు డెవిల్ సగం షూటింగ్ మాత్రమే పూర్తి చేసుకుంది. పెద్ద బడ్జెట్ వేసుకున్న నిర్మాత దిక్కుతోచని అయోమయంలో ఉన్నారని బెంగళూరు మీడియాలో వచ్చింది. అయితే మిగిలింది ఎప్పుడు ఫినిష్ చేశారనేది అంతుచిక్కడం లేదు. బెయిల్ టైంలో కానిచ్చేసి ఉంటారని వినికిడి.
ఇంత ఘోరం జరిగినా దర్శన్ కు ఫ్యాన్స్ మద్దతు బాగానే ఉంది. చూస్తుంటే డెవిల్ కు గ్రాండ్ ఓపెనింగ్స్ ఇచ్చేలా ఉన్నారు. దర్శన్ గత సినిమా కాటేరా డిసెంబర్ లోనే రిలీజై బ్లాక్ బస్టర్ సాధించింది. ఇప్పుడదే రిపీట్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. సాటి ఫ్యాన్ ని చంపినా సరే ఇంత ఆరాధనా భావం చూపించడం ఏమిటని కొందరు సామాజిక కార్యకర్తలు నిలదీస్తుండగా, నేరం రుజువు అయ్యేంత వరకు తమ హీరో దోషి కాదని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ కథకు ఎక్కడ ముగింపు ఉంటుందో అంతు చిక్కడం లేదు. విచిత్రం ఏమిటంటే డెవిల్ కు బిజినెస్ ఎంక్వయిరీలు బాగున్నాయట.
This post was last modified on October 7, 2025 9:26 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…