Political News

అలా కుద‌ర‌దు: జ‌గ‌న్‌కు షాకిచ్చిన పోలీసులు..!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు అన‌కాప‌ల్లి పోలీసులు.. భారీ షాక్ ఇచ్చారు. ఆయ‌న‌కు రోడ్డు మార్గం లో ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌ని తేల్చి చెప్పారు. సుమార 63 కిలో మీట‌ర్ల మేర రోడ్ షో చేయాల‌ని జ‌గ‌న్ భావించార‌ని.. కానీ, త‌మిళ‌నాడులోని కరూర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాటలో 41 మంది మృతి చెందార‌ని.. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు రోడ్ షో నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తి ఇవ్వ‌బోమ‌ని తేల్చి చెప్పారు. ఆయ‌న విశాఖ‌ప‌ట్నం నుంచి నేరుగా హెలికాప్ట‌ర్‌లో వెళ్లేందుకు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్న‌ట్టు చెప్పారు.

ఏం జ‌రిగింది?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ప్ర‌భుత్వంపై నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు పిలుపునిచ్చారు. త‌న హ‌యాంలో తీసుకు వ‌చ్చిన 17 మెడిక‌ల్ కాలేజీల్లో 12 కాలేజీల‌ను ప్ర‌వేటు భాగ‌స్వామ్యానికి ఇవ్వ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌డు తున్నారు. ఈ క్ర‌మంలో స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. కొత్త‌గా మెడిక‌ల్ కాలేజీ ప్రారంభించి వ‌దిలేశార‌ని స‌భ‌లో ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. కానీ, దానికి జీవో కూడా లేద‌ని.. అది ఎప్ప‌టికి పూర్త‌వుతుందో కూడా చెప్ప‌లేమ‌న్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై జ‌గ‌న్ స్పందించారు.

స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్మాణం దాదాపు పూర్తి చేసుకుంద‌ని, కానీ, ఉద్దేశ పూర్వ‌కంగానే ఆయ‌న వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో తానే స్వ‌యంగా రంగంలోకి దిగి స‌ద‌రు కాలేజీని చూపిస్తాన‌ని స‌వాల్ విసిరారు. ఈ క్ర‌మంలో గురువారం విశాఖ‌ ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. విశాఖ నుంచి 63 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న మాక‌వ‌ర పాలెంలో నిర్మాణంలో ఉన్న మెడిక‌ల్ కాలేజీని జ‌గ‌న్ సంద‌ర్శించ‌నున్నారు.

దీనికి సంబంధించి వైసీపీ నాయ‌కులు అన‌కాప‌ల్లి జిల్లా , విశాఖ జిల్లా పోలీసుల‌కు అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే.. విశాఖ‌కు వ‌చ్చే జ‌గ‌న్‌.. అక్క‌డి నుంచి 63 కిలో మీట‌ర్ల మేర‌.. రోడ్ షో ద్వారా.. కాలేజీ నిర్మాణంలో ఉన్న మాక‌వ‌ర‌పాలేనికి వ‌స్తార‌ని పేర్కొన్నారు. రోడ్ షోకు అనుమ‌తించాల‌ని కోరారు. కానీ, తాజాగా అన‌కాప‌ల్లి జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. త‌మిళ‌నాడు ఘ‌ట‌న నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు ఆ అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని.. ఆయ‌న విశాఖ నుంచి నేరుగా హెలికాప్ట‌ర్‌లో మాక‌వ‌రపాలేనికి చేరుకోవ‌చ్చ‌ని తెలిపారు. దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

This post was last modified on October 7, 2025 6:27 pm

Share

Recent Posts

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

60 minutes ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

2 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

3 hours ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

3 hours ago

త్రివిక్రమ్ బాధ్యత గురించి భేతాళ ప్రశ్న

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…

3 hours ago

రియాలిటీకి దగ్గరగా ఉన్నా కామెంట్స్ తప్పలేదు

నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…

4 hours ago