ఓజీకి కోర్టు చేసిన మేలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘ఓజీ’కి విడుదల ముంగిట ఉన్న హైప్‌ వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరిగాయి. సినిమాకు ఎబోవ్ యావరేజ్ టాక్ రాగా.. తొలి వీకెండ్లో వసూళ్లకు ఢోకా లేకపోయింది. తొలి రోజు ఎక్కువగా సినిమా చూసేది అభిమానులే. పెయిడ్ ప్రిమియర్స్‌ను కూడా వాళ్లే ఓన్ చేసుకుంటారు. కాబట్టి డే-1 వసూళ్లు భారీగా వచ్చాయి. ఫ్యాన్స్ రెండోసారి చూసే కంటెంట్ ఉండడం వల్ల వీకెండ్ అంతా కూడా వాళ్లు సినిమాను సెలబ్రేట్ చేశారు. 

ఐతే సామాన్య ప్రేక్షకులు ఎగబడి చూసే సినిమా అయితే కాదిది. వాళ్లు ఆసక్తి ప్రదర్శించినా.. అధిక టికెట్ ధరలు వారిని నిరుత్సాహానికి గురి చేశాయి. మల్టీప్లెక్సుల్లో 400, అంతకంటే ఎక్కువ రేటు పెట్టి సినిమా చూడాలి. సింగిల్ స్క్రీన్ల రేటు కూడా 300కు దగ్గరగా ఉంటే ఫ్యామిలీస్, సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కష్టం. అందుకే వీకెండ్ అవ్వగానే ‘ఓజీ’ వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో సోమవారం మెజారిటీ షోలకు ఆశించిన ఆక్యుపెన్సీలు లేవు. థియేటర్లు ఖాళీగా కనిపించాయి. సాయంత్రం షోలకు మాత్రం స్పందన పర్వాలేదు.

వీకెండ్ వరకు సినిమాను ఫ్యాన్స్ సెలబ్రేట్ చేశారు, సోమవారం నుంచి టికెట్ల రేట్లు తగ్గిస్తే సామాన్య ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తారని అభిమానులే స్వయంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కానీ నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూటర్లు స్పందించలేదు. ఏపీలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు సొంతంగా కొన్ని చోట్ల రేట్లు తగ్గించడంతో ఆక్యుపెన్సీలు పెరిగాయి. తెలంగాణలో రేట్లు తగ్గించక సినిమాను కిల్ చేస్తున్నారని.. నార్మల్ రేట్లు ఉంటే దసరా సెలవుల్లో సినిమాకు మంచి ఆక్యుపెన్సీలు ఉంటాయని అభిమానులు మొత్తుకుంటున్నా స్పందన కరవైంది. 

ఐతే అదే సమయంలో ఈ సినిమా టికెట్ల రేట్లపై పోరాటం చేస్తున్న మల్లేష్ యాదవ్ అనే లాయర్, విజయ్ గోపాల్ అనే సామాజిక కార్యకర్త కోర్టుకు వెళ్లారు. మంగళవారం నుంచి టికెట్ల ధరలు తగ్గించాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది. ఇది వెంటనే అమల్లోకి వచ్చి ఓజీ టికెట్ రేట్లు నార్మల్‌కు వచ్చేశాయి. ఇది అంతిమంగా సినిమాకు మేలు చేసేదే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నార్మల్ రేట్లు ఉంటే దసరా సెలవుల్లో న్యూట్రల్ ఆడియన్స్, కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు వచ్చే అవకాశముంటుంది. కచ్చితంగా ఆక్యుపెన్సీలు పెరుగుతాయి. సినిమాకు రెండో వీకెండ్ వరకు లాంగ్ రన్ ఉండొచ్చని అంచనా.