ఓజి విషయంలో పవన్ కళ్యాణ్, సుజిత్ మీద అభిమానులకు ఎంత నమ్మకం ఉందో అంతే కాన్ఫిడెన్స్ సంగీత దర్శకుడు తమన్ మీద కూడా చూపిస్తున్నారు. నిజానికి తమన్ కొంత కాలంగా ఫామ్ లో లేడు. ‘డాకు మహారాజ్’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ప్రశంసలు వచ్చాయి కానీ పాటలు ఆశించిన స్థాయిలో వెళ్ళలేదు. ఆది పినిశెట్టి ‘శబ్దం’ని ఎవరూ పట్టించుకోలేదు. ‘మ్యాడ్ స్క్వేర్’ కి ఇచ్చిన బీజీఎమ్ మెరుపులు అంతంత మాత్రమే. ఇక ‘గేమ్ ఛేంజర్’ గురించి చెప్పనక్కర్లేదు. తమన్ వైపు నుంచి పూర్తి కష్టం కనిపించింది కానీ కంటెంట్ లోపం వల్ల ఒక డిజాస్టర్ ఖాతాలో పడింది. ఇదంతా 2025లో జరిగిన స్టోరీ.
ఇప్పుడు తమన్ కంబ్యాక్ కోసం మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ‘ఓజి’కి జపాన్ ఫ్లేవర్ లో కంపోజ్ చేసిన సాంగ్స్, స్కోర్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. యూనిట్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి పవన్ కోసం తమన్ డబుల్ డ్యూటీ చేశాడట. ముఖ్యంగా సెకండాఫ్ లో చివరి నలభై అయిదు నిముషాలు సుజిత్ తో కలిసి ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తాడని ఆ స్థాయిలో కంపోజింగ్ ఉందని అంటున్నారు. గాడ్ ఫాదర్ లాంటి యావరేజ్ మూవీలోనే చిరంజీవికి అదిరిపోయే స్కోర్ ఇచ్చిన తమన్ ఇప్పుడు పవన్ కు ఎలాంటి సంగీతం ఇచ్చి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రాబోయే మూడు నాలుగు నెలలు తమన్ డామినేషన్ కనిపించనుంది. సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ పాటలు యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. చార్ట్ బస్టర్ కావడం ఖాయమని టీమ్ ధీమాగా ఉంది. ‘అఖండ 2’ మీద ఎలాంటి హైప్ ఉందో వేరే చెప్పనవసరం లేదు. ఇంటర్వెల్ కే పైసా వసూలని తమన్ స్వయంగా చెబుతున్నాడు. జనవరిలో ‘ది రాజా సాబ్’ తో తమన్ పనితనం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళాలి. దర్శకుడు మారుతీ అదే చెబుతున్నాడు. ఇవి కాకుండా ‘ఇదయం మురళి’ అనే తమిళ్ మూవీ కూడా త్వరలో రిలీజ్ కానుంది. చూస్తుంటే తమన్ పునరాగమనం కాస్తా తమన్ వైభవంలా మారబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates