Movie News

సుజిత్ నమ్మకం ఖరీదు వందల కోట్లు

దశాబ్దంపైగానే అనుభవమున్నా ఇప్పటిదాకా కేవలం మూడు సినిమాలతో క్రేజ్ సంపాదించడం ఒక్క దర్శకుడు సుజిత్ కు మాత్రమే దక్కిన అదృష్టం. రన్ రాజా రన్ ఎంత సూపర్ హిట్ అయినా అదేమీ ప్యాన్ ఇండియా స్థాయిలో రీచ్ కాలేదు. అయినా సరే యువి క్రియేషన్స్, ప్రభాస్ జంటగా తనను నమ్మి సాహో అవకాశాన్ని ఇచ్చాయి. టెక్నికల్ గా ఋజువు చేసుకున్నా కమర్షియల్ గా దాని ఫలితం నిరాశ పరిచిన మాట వాస్తవం. ఆ తర్వాత ఏళ్ళ తరబడి ఎదురు చూపులకు దక్కిన వరంగా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ దొరికింది. చిరంజీవి గాడ్ ఫాదర్ ఆఫర్ వచ్చినా సుజిత్ వద్దనుకోవడానికి కారణం అది రీమేక్ కావడమే.

ఇప్పుడు సుజిత్ జీవితంలోనే అతి ముఖ్యమైన దశ వచ్చింది. తన ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా ఓజి మీద విపరీతమైన హైప్ వచ్చింది. దీనికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ అని చెప్పలేం. ఎందుకంటే ఇంత హైప్ హరిహర వీరమల్లు, బ్రో, భీమ్లా నాయక్, వకీల్ సాబ్ కు రాలేదు. కానీ ఓజికి మాత్రమే ఎందుకు కనిపిస్తోందంటే సుజిత్ ఓజి అనే పేరుని బ్రాండ్ గా మార్చి దాని మీద సృష్టించిన నమ్మకం. గతంలో పవన్ పంజాలో గ్యాంగ్ స్టర్ గా నటించినప్పటికీ అంతకు మించిన ఇంటెన్స్ డ్రామా ఓజిలో చూపించబోతున్నాననే హామీ అనౌన్స్ మెంట్ పోస్టర్ నుంచి ఇస్తూనే వచ్చాడు. ఇక టీజర్ ఒక మినీ సునామిలాగా దూసుకుపోయింది.

ఇక చివరి ఘట్టంలో అడుగుపెట్టబోతున్న సమయంలో అంచనాలు ఆకాశాన్ని దాటుతున్నాయి. సుజిత్ కు రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ లాగా వందల కోట్ల లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు లేవు. కేవలం ఒక హిట్టు ఒక ఫ్లాపు ఉన్నాయి. అయినా సరే సంవత్సరాల తరబడి ఓజి మీద విపరీతంగా కష్టపడిన సుజిత్ కు దీని సక్సెస్ చాలా కీలకం. టార్గెట్ కొట్టాడా పవన్ అభిమానులు కొన్నేళ్లపాటు గుండెల్లో పెట్టుకుంటారు. ఆడియన్స్ వందల కోట్ల కలెక్షన్లను ధారాళంగా కురిపిస్తారు. అది ఎంతవరకు నిజమవుతోందో తెలియాలంటే రేపు అర్ధరాత్రి దాకా వేచి చూస్తే చాలు. రివ్యూలు, రిపోర్టులు, టాకులు అన్నీ వచ్చేస్తాయి.

This post was last modified on September 23, 2025 11:17 am

Share

Recent Posts

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

8 minutes ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

24 minutes ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

44 minutes ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

2 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

3 hours ago

మహారాజాకు దక్కిన హాలీవుడ్ గౌరవం

రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…

3 hours ago