సాహో కనెక్షన్ నిజంగా ఉంటుందా

ఓజి ట్రైలర్ అఫీషియల్ గా యూట్యూబ్ లో వచ్చాక ఫ్యాన్స్ యాక్టివేట్ అయిపోయి డీ కోడింగ్ చేయడం మొదలుపెట్టారు. రకరకాల కోణాల్లో కథను యనాలసిస్ చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా అందరూ మాట్లాడుకుంటున్నది సాహో కనెక్షన్. వీడియోలోని ఒక షాట్లో వాజి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ అనే బోర్డు షిప్ యార్డ్ కంటైనర్ మీద ఉంటుంది. ఇది సాహోలో మాఫియా సామ్రాజ్యం నడిచే నగరం పేరు. దీంతో రెండింటికి లింక్ ఉందనే కోణంలో కొందరు స్టోరీలు అల్లగా మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా ప్రభాస్ క్యామియో ఉంటుందనే రేంజ్ లో ప్రచారాలు మొదలుపెట్టారు. అఫ్కోర్స్ నమ్మేవాళ్ళు లేకపోలేదు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఓజిలో ఎలాంటి సాహో కనెక్షన్ ఉండదని తెలిసింది. వాజి పేరుని వాడటం తప్ప దర్శకుడు సుజిత్ కు ఇంకే ఉద్దేశం లేదు. ప్రాక్టికల్ గా చూస్తే ఓజి కథా నేపథ్యం 1980 నుంచి 1990 టైంలో జరుగుతుంది. అంటే ముంబై పేరు బొంబాయిగా ఉన్నప్పటి వాతావరణాన్ని ఇందులో చూపించబోతున్నారు. కాస్ట్యూమ్స్ కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి. కానీ సాహో టైం లైన్ వర్తమానంలో చూపించారు. కాబట్టి ఏదో కనెక్షన్ ఉంటుంది, సర్ప్రైజ్ ఇస్తారనేది నిజం కాకపోవచ్చు. కూలీకి సైతం రిలీజ్ కు ముందు ఇలాంటి థియరీలు బోలెడు రాశారు కానీ వాటిలో ఏ ఒక్కటి నిజం కాలేదు.

అయినా సుజిత్ కు సినిమాటిక్ యునివర్సులు సృష్టించాలనే ఆలోచన లేదు. ఒక ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ ని తాను ఎలా చూపించాలనుకున్నాడో అంతకు మించిన ఎలివేషన్లతో ఓజాస్ గంభీరనుం రాసుకున్నాడు. అందుకే అనౌన్స్ మెంట్ స్టేజి నుంచే దీని మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఒక్క రెండు రోజులు ఆగితే అన్ని విషయాలకు క్లారిటీ వస్తుంది. ఇదంతా ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ఊర మాస్ వయొలెంట్ విశ్వరూపం చూసి అభిమానులు పిచ్చ హ్యాపీగా ఉన్నారు. నిమిషాల వ్యవధిలో అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకోవడం చూస్తే ట్రైలర్ రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.