బాలీవుడ్‌లో ఒకప్పుడు హాట్‌టాపిక్‌గా మారిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ ప్రేమకథ, బ్రేకప్ గురించి మళ్లీ చర్చ మొదలైంది. ప్రముఖ ఫిల్మ్‌మేకర్ ప్రహ్లాద్ కాక్కర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ విషయాన్ని హైలైట్ చేశాయి. “చాలా ఫిజికల్, ఆబ్సెసివ్” స్వభావం కలవాడని చెప్పారు. ఆ ప్రవర్తనను తట్టుకోలేకపోవడమే ఈ సంబంధం ముగింపుకు దారితీసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాక్కర్ వివరణ ప్రకారం, 2002లో విడిపోయిన తర్వాత ఐశ్వర్యాకు బ్రేకప్ వల్ల పెద్ద కష్టమేమీ రాలేదని, కానీ ఇండస్ట్రీ మొత్తం సల్మాన్ వైపు నిలబడి తనను విస్మరించిందన్న భావనతో ఆమె బాగా బాధపడ్డారని వెల్లడించారు. “తన తప్పు కాకపోయినా.. అందరూ సల్మాన్‌కే మద్దతు ఇచ్చారు. అది ఐశ్వర్యాకు ద్రోహంలా అనిపించింది. అందుకే ఇండస్ట్రీపై నమ్మకం కోల్పోయింది” అని ఆయన చెప్పారు.
ప్రహ్లాద్ కాక్కర్ మరో ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. “నేను అదే బిల్డింగ్‌లో ఉండేవాడిని. సల్మాన్ తరచూ ఫోయర్‌లో సీన్లు క్రియేట్ చేసేవాడు. గోడలకు తల బాదుకునేవాడు.. అసలు సంబంధం చాలా కాలం క్రితమే ముగిసినా, బయటికి ఆలస్యంగా తెలిసింది. ఆ బ్రేకప్ ఐశ్వర్యా కుటుంబనికి రిలీఫ్ లా అనిపించింది” అని చెప్పారు.
‘హమ్ దిల్ దే చుకే సనం’ సినిమా సెట్స్‌లో మొదలైన ఈ ప్రేమకథ మూడు సంవత్సరాలు మాత్రమే సాగింది. కానీ దాని ముగింపు మాత్రం బాగా పబ్లిక్ అయ్యింది. ఐశ్వర్యా అనేక ఇంటర్వ్యూల్లో ఒకప్పుడు ఇన్ డైరెక్ట్ గానే ఒకరి వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నానని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు కాక్కర్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఆ దశలో ఆమె ఎదుర్కొన్న కష్టాలు మరోసారి బయటకు వచ్చాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates