‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో వెలిగిపోవాలని ప్రతి స్టార్ హీరో ఆశపడ్డవాడే. కానీ అందరికీ కాలం కలిసి రాలేదు. పాన్ ఇండియా లేబుల్ వేసుకుని వచ్చిన చాలా సినిమాలు దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. కొన్ని చిత్రాలకూ దేశవ్యాప్తంగా అనూహ్యమైన ఆదరణ దక్కి హీరోలకు ఊహించని ఫాలోయింగ్ వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాల మీద ఫోకస్ తగ్గించినప్పటికీ ఆయన కొన్ని పాన్ ఇండియా ప్రయత్నాలు చేశారు.
సర్దార్ గబ్బర్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలతో తెలుగేతర భాషల వాళ్లనూ ఆకట్టుకోవాలని చూశారు. కానీ ఆ సినిమాల్లో కంటెంట్ బలంగా లేకపోవడంతో పాన్ ఇండియా రిలీజ్ నామమాత్రం అయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ సరిగా ఆడని ఈ చిత్రాలు.. మిగతా చోట్ల ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఐతే పవన్ పాన్ ఇండియా లాంచింగ్‌కు సరైన సినిమా చేతిలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఆ దిశగా ప్లానింగ్ సరిగా లేకపోవడం అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తోంది.
ఓజీ.. పవన్ కెరీర్లోనే అత్యధిక హైప్‌తో వస్తున్న సినిమా. ఈ సినిమా కోసం అభిమానులు ఊగిపోతున్నారు. యుఎస్‌లో ఈ సినిమాకు రెండు వారాల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఆల్రెడీ ఈ చిత్రం మిలియన్ మార్కును దాటేసింది. కల్కి, పుష్ప లాంటి చిత్రాల కంటే వేగంగా ఆ మార్కును అందుకుందీ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ చేసినా రచ్చ మామూలుగా ఉండదని అర్థమవుతోంది. ఈ సినిమా ప్రోమోలు చూసి ఇతర భాషల వాళ్లు కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
కానీ ‘ఓజీ’ పాన్ ఇండియా రిలీజ్ విషయంలో మేకర్స్ అంత సీరియస్‌గా ఉన్నట్లు లేరు. ఇతర భాషల్లో అసలు ప్రమోషన్ అన్నదే లేదు. హిందీలో చాలా లిమిటెడ్ రిలీజ్ ఉండబోతోందీ సినిమాకు. ఓటీటీ విండో 8 వారాల్లోపు ఉండడంతో నార్త్ మల్టీప్లెక్సులు ఈ సినిమాను ప్రదర్శించబోవు. లేక లేక పవన్ నుంచి అభిమానులు ఆశించే బలమైన కంటెంట్ ఉన్న, హీరోయిక్ మూవీ వస్తుంటే.. దీన్ని ఇతర భాషల్లో సరిగా రిలీజ్ చేయకపోవడం, ప్రమోట్ చేయకపోవడం పట్ల అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు తెలుగులో కూడా ఈ సినిమాను సరిగా ప్రమోట్ చేయట్లేదు. దీనికి ఉన్న హైప్ దృష్ట్యా తెలుగులో పబ్లిసిటీ లేకపోయినా పర్వాలేదు. కానీ ఇలాంటి సినిమాకు పాన్ ఇండియా రిలీజ్, ప్రమోషన్ ప్లానింగ్ లేకపోవడం చూస్తే మంచి ఛాన్స్ మిస్సవుతున్నట్లే కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates