ఒక సమయంలో బ్రహ్మానందంను కూడా వెనక్కి నెట్టి టాలీవుడ్లో నంబర్ వన్ కమెడియన్‌గా ఒక వెలుగు వెలిగాడు సునీల్. కానీ ‘అందాల రాముడు’తో అనుకోకుండా హీరోగా మారి హిట్టు కొట్టిన అతను.. ఆ తర్వాత పూల రంగడు, మర్యాద రామన్న చిత్రాలతోనూ విజయాలు అందుకోవడంతో కామెడీ వేషాలు వదిలేసి సీరియస్‌గా హీరో వేషాల మీదే ఫోకస్ పెట్టాడు. కానీ ఈ ఆలోచనే ఒక దశలో తన కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసింది.
హీరోగా వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొని రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది తన పరిస్థితి. దీంతో ఒక దశ దాటాక హీరో వేషాలు వదిలేసి మళ్లీ కామెడీ ట్రై చేశాడు. అవి వర్కవుట్ కాకపోతే క్యారెక్టర్, విలన్ వేషాల వైపు మళ్లాడు. అవి కొంతమేర క్లిక్ అయి ఇప్పుడు తన కెరీర్ బాగానే నడుస్తోంది. ఐతే సునీల్‌ను ఇక మళ్లీ హీరో వేషాల్లో చూడలేమనే అంతా అనుకుంటున్న సమయంలో అతను లీడ్ రోల్‌లో ఒక సినిమా చేస్తున్న విషయాన్ని నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ వెల్లడించారు.
తమ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బేనర్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రాల గురించి వివరిస్తూ.. సునీల్‌తో ‘మర్యాద కృష్ణయ్య’ అనే సినిమా గురించి ప్రస్తావించారు విశ్వప్రసాద్. ఈ ఏడాదే ఆ సినిమా రిలీజవుతుందని కడూ ఆయన ప్రకటించారు. ఐతే ఇదేమీ కొత్త చిత్రం కాదు. నాలుగేళ్ల కిందట ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ‘మర్యాద రామన్న’లో సునీల్‌కు జోడీగా నటించిన సలోనినే ఇందులో కూడా హీరోయిన్. ‘మనసంతా నువ్వే’ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ ఏవో కారణాలతో విడుదల కాలేదు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చిన్న బేనర్‌గా ఉన్నపుడు వేరే నిర్మాతలతో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు విశ్వప్రసాద్. కానీ ఇప్పుడా సంస్థ టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్స్‌లో ఒకటిగా ఎదిగింది. రెండంకెల సంఖ్యలో సినిమాలు నిర్మిస్తోంది. ఇలాంటి టైంలో సునీల్ సినిమాను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి దాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు విశ్వప్రసాద్. కానీ హీరోగా సునీల్‌ను అందరూ మరిచిపోయిన సమయంలో, అస్సలు ఫామ్‌లో లేని వి.ఎన్.ఆదిత్య రూపొందించిన సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకర్షిస్తుందన్నది ప్రశ్న.
Gulte Telugu Telugu Political and Movie News Updates