సినిమాటిక్ యూనివర్శ్.. మల్టీవర్స్.. ఇండియన్ సినిమాల్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ట్రెండ్. ‘విక్రమ్’ సినిమాలోని క్యారెక్టర్లకు ‘ఖైదీ’ చిత్రంలోని పాత్రలతో కనెక్షన్ పెట్టి లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్ పేరుతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాడు లోకేష్ కనకరాజ్. అంతకంటే ముందు బాలీవుడ్లో యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు.. తమ స్పై సినిమల్లో ఇలాంటి కనెక్షన్లతో ప్రేక్షకులను అలరించారు. ఐతే హాలీవుడ్లో ఎప్పట్నుంచో ఈ ట్రెండ్ చూస్తున్నాం.
పాపులర్ సూపర్ హీరో పాత్రలన్నింటినీ ఒక చోటికి చేర్చి ‘ఎవెంజర్స్’ పేరుతో ఫ్రాంఛైజీ సినిమాలు తీయడం ద్వారా ఎప్పటికప్పుడు కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతూ వచ్చింది హాలీవుడ్. కొన్నేళ్ల కిందట ‘ఎండ్ గేమ్’ పేరుతో సినిమా తీసి ఈ ఫ్రాంఛైజీకి తెరదించేశారు మేకర్స్. ఐతే అక్కడ ముగిసిన ట్రెండును ఇండియాలో కొనసాగిస్తే బాగుంటుందని అంటున్నాడు యువ కథానాయకుడు తేజ సజ్జ.
తన కొత్త చిత్రం ‘మిరాయ్’ ప్రమోషన్లలో భాగంగా కేరళకు వెళ్లిన తేజ.. అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ‘ఎవెంజర్స్’ గురించి హింట్ ఇచ్చాడు. తేజ ఇప్పటికే ‘హనుమాన్’లో ఒక సూపర్ హీరో క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు ‘మిరాయ్’లో సూపర్ యోధగా అలాంటి పాత్రే ఇంకొకటి చేశాడు. ఇటీవలే మలయాళం నుంచి మరో సూపర్ హీరో మూవీ ‘లోకా’ వచ్చింది. అందులో తొలిసారి ఒక హీరోయిన్ని సూపర్ హీరోగా చూశాం. మలయాళం నుంచే ‘మిన్నల్ మురళి’ రూపంలో మరో సూపర్ హీరో సినిమా ఉంది.
ఈ పాత్రలన్నింటినీ కలిపి భవిష్యత్తులో ‘ఎవెంజర్స్’ తరహా మల్టీవర్స్ తీస్తే బాగుంటుందని తేజ అన్నాడు. ఈ ఆలోచన నిజం అయినా ఆశ్చర్యం లేదని.. ఎవరైనా అలాంటి సినిమా తీస్తే నటించడానికి తాను రెడీ అని అతనన్నాడు. మరి తేజ చెప్పిన క్రేజీ ఐడియాను ఎవరైనా సీరియస్‌గా తీసుకుని ఇండియన్ ఎవెంజర్స్‌ను తెరపైకి తీసుకొస్తారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates