ఒక్కో ట్రెండు ఒక్కొక్కరికి లక్కు తెచ్చి పెడుతుంది. అలా ఓటిటి ట్రెండు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ పాలిట వరమయింది. కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రం యువ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, ఆ చిత్రానికి సిద్ధు క్రియేటివ్ సైడ్ కూడా బాగా ఇన్వాల్వ్ అవడంతో అతడి చేతిలో డబ్బులు పెడితే సేఫ్ అని నిర్మాతలు భావిస్తున్నారు. సిద్ధుతో సినిమా అంటే నిర్మాతకు ఎలాంటి టెన్షన్ వుండదు. ఎందుకంటే ఎంత బడ్జెట్ కావాలనేది ముందే చెప్తాడు.
నాలుగైదు కోట్లలోపే అతను సినిమాలు ప్లాన్ చేస్తాడు. దీని వల్ల రిస్కు పెద్దగా వుండదు. ఆ సినిమా బడ్జెట్ ఎంతయినా కానీ నిర్మాతపై భారం పడదు, ఒకవేళ తక్కువలో పూర్తయినా అది నిర్మాతకు చెందదు. ఓటిటి గేమ్‌ని ఇంకా స్టడీ చేయని టాప్ డైరెక్టర్లు నెమ్మదిగా ఇటు వైపు అడుగులు వేస్తున్నారు. ఈలోగా తనకున్న డిమాండ్‌తో సిద్ధు తన ఇల్లు చక్కబెట్టేసుకుంటున్నాడు. అతని రీసెంట్ సినిమా ‘మా వింత గాధ వినుమా’ దారుణంగా విఫలమయినా కానీ ప్రస్తుతానికి సిద్ధుకి వచ్చిన నష్టమేమీ లేదు. అతను తన సినిమాల బడ్జెట్ అదుపులో వుంచినంత వరకు ఈమాత్రం రిస్క్ చేయడానికి నిర్మాతలు ముందుకొస్తూనే వుంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates