పెద్ది అంతకు మించి ఉంటుంది

రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న పెద్ది షూటింగ్ 50 శాతం పూర్తయిపోయింది. ఇటీవలే మైసూర్ లో టైటిల్ సాంగ్ షూట్ ని వందలాది జూనియర్ ఆర్టిస్టులతో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. పర్ఫెక్షన్, డిటైలింగ్ కోసం తపిస్తున్న బుచ్చిబాబు కొన్ని షాట్స్ అనుకున్న స్థాయిలో రాకపోతే మళ్ళీ మళ్ళీ రీ షూట్ అంటున్నారు తప్పించి కాంప్రోమైజ్ కావడం లేదట. దానికి తగ్గట్టే చరణ్ సహకారం ఉండటంతో బెస్ట్ అవుట్ ఫుట్ వస్తోందని ఇన్ సైడ్ టాక్. తాజాగా దుబాయ్ లో జరిగిన సైమా అవార్డు వేడుకల్లో పాల్గొన్న పెద్ది కెమెరామెన్ రత్నవేలు మా ప్రతినిధితో ప్రత్యేక ముచ్చట్లు పంచుకున్నారు.

గతంలో లేని విధంగా రామ్ చరణ్ తన స్టైల్, యాక్షన్, డిక్షన్ తో పెద్దికి సరికొత్త రూపం తెస్తున్నారని, కంటెంట్ గొప్పగా ఉండటం వల్లే నేను నా హద్దులు చెరిపేసుకుని రంగస్థలంని మించిన స్థాయిలో ఒక విభిన్నమైన అనుభూతిని కలిగించేందుకు కష్టపడుతున్నానని చెప్పడం అంచనాలు పెంచేలా ఉంది. మరో ఇంటర్వ్యూలో రత్నవేల్ మాట్లాడుతూ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ పదే పదే క్రికెట్ షాట్లు చూపిస్తే బోర్ కొడుతుందని, కానీ బుచ్చిబాబు దీనికి ఎంచుకున్న డిఫరెంట్ ప్యాట్రన్ థియేటర్ లో సర్ప్రైజ్ ఇస్తుందని, తనకు ఈ ప్రాజెక్టు ఛాలెంజ్ లా నిలుస్తోందని చెప్పుకొచ్చారు.

ఇవన్నీ చూస్తుంటే పెద్ది ఏదో ఆషామాషీ విలేజ్ డ్రామా కాదనే విషయం అర్థమైపోయింది. ఇప్పటిదాకా వచ్చిన ఇన్ఫోలు లీకులు విశ్లేషించుకుంటే రంగస్థలంకు పదింతలు అవుట్ ఫుట్ ని పెద్ది నుంచి ఆశించవచ్చు. మార్చి 27 విడుదల కాబోతున్న పెద్ది కోసం పలు అంతర్జాతీయ సంస్థలు కొలాబరేట్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నాయట. ఒకవేళ అదే కనక నిజమైతే ఎక్కువ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ లేని ఒక ఎమోషనల్ డ్రామాకు ఇలాంటి టై అప్ జరగడం మొదటిసారి అవుతుంది. ఓజి రిలీజయ్యాక దసరా పండగ సందర్భంగా పెద్ది నుంచి మొదటి లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఫ్యాన్స్ ఎదురు చూపులు దాని కోసమే.