సరిగ్గా ఇంకో ఇరవై రోజుల్లో ఓజి సంభవం జరగనుంది. సంవత్సరాల తరబడి అభిమానులు సాగించిన ఎదురు చూపులకు క్లైమాక్స్ వచ్చేసింది. ఏరియాల వారిగా బయ్యర్లు లాకైపోతున్నారు. థియేటర్ అగ్రిమెంట్లు ఊపందుకున్నాయి. ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లో అరవై శాతానికి పైగా స్క్రీన్లలో ఓజినే ఉన్నా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. జనసేన డొనేషన్ కోసమే అయినా ఒక అభిమాని ఓజి ప్రీమియర్ టికెట్ ను 5 లక్షలకు కొనుగోలు చేయడం దీని మీద ఎంత క్రేజ్ ఉందో చాటి చెబుతోంది. సెప్టెంబర్ 25 నెవర్ బిఫోర్ సెలబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ ఏపీ తెలంగాణలో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రమోషన్లలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారా లేదా అనేది అభిమానుల మధ్య డిస్కషన్ గా మారింది. హరిహర వీరమల్లు కోసం పవన్ చాలా తిరిగారు. ఈవెంట్లకు వచ్చారు. ఎన్నడూ లేనిది దశాబ్దాల తర్వాత ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఏఎం రత్నం ఇంత ఖర్చు పెట్టి కష్టపడ్డాడు కాబట్టే ఆయన కోసం వచ్చానని పవన్ పబ్లిక్ గా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఫలితం రాకపోవడం వేరే విషయం కానీ ఏపీ డిప్యూటీ సిఎంగా అంత బిజీలోనూ టైం కేటాయించడం గొప్ప విషయమే. కానీ ఓజికి అంత శ్రద్ధ అవసరం లేదు. ఇప్పటికే కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ హైప్ ని ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా మోస్తోంది.
ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పబ్లిసిటీలో భాగం కాకపోయినా ఎలాంటి నష్టం ఉండదు. నేరుగా తెరమీద చూసుకుని ఫ్యాన్స్ థ్రిల్ అవుతారు. సెప్టెంబర్ 18 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అప్పుడు టైం దొరకడం కష్టం. రిలీజ్ వీక్ లోనే మంత్రి నిమ్మల రామానాయుడు కూతురు పెళ్లి వేడుక లాంటి ముఖ్యమైన కార్యక్రమాలున్నాయి. అన్నింటికి పవన్ హాజరు ఉంటుంది. మరి ఒకవేళ ఓజి టీమ్ కనక పవన్ ని కోరుకుంటే ఈ పదమూడు రోజుల్లో పూర్తి చేసేయాలి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ పాట షూట్ లో ఉన్న పవన్ ఓజాస్ గంభీరకు ఎంత టైం ఇస్తారో, అసలు ఇస్తారో లేదో లెట్ వెయిట్ అండ్ సీ.
Gulte Telugu Telugu Political and Movie News Updates