కొత్త సినిమాలు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని ప్రేక్షకులకు ఉంది. థియేటర్లు జనాలతో కళకళలాడాలని యజమానులకు ఉంది. అలాగే తమ సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేసి ఎక్కువ ఆదాయం పొందాలని నిర్మాతలకూ ఉంది. కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు.
ఇండియాలో థియేటర్లు పున:ప్రారంభానికి అనుమతులైతే వచ్చాయి కానీ.. అవి ఎప్పుడు పూర్తి స్థాయిలో నడుస్తాయో మాత్రం తెలియడం లేదు. అందరూ వెయిట్ అండ్ సీ సూత్రాన్నే పాటిస్తున్నారు. తెరుచుకున్నవే తక్కువ థియేటర్లు, పైగా అవి నామమాత్రంగా నడుస్తున్నాయి.
థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో నడిస్తే.. ఒక పెద్ద సినిమా రిలీజైతే అంతా సెట్ అయిపోతుందని అని అందరూ చూస్తున్నారు. కానీ ఆ రోజులు ఎప్పుడొస్తాయో తెలియట్లేదు. ఐతే ఇప్పుడు ఓ ఎగ్జైటింగ్ మూవీ థియేటర్లలోకి రాబోతుండటంతో అందరిలోనూ ఆశలు కలుగుతున్నాయి.
ప్రస్తుత ప్రపంచ నంబర్ వన్ డైరెక్టర్ అనదగ్గ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘టెనెట్’ ఎట్టకేలకు ఇండియాలో విడుదల కాబోతోంది. డిసెంబరు 4న ఈ చిత్రాన్ని ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. పోస్టర్లు కూడా వేసేశారు. ఈ సినిమా రిలీజయ్యే సమయానికి థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తాయి.
పూర్తి స్థాయిలో థియేటర్లలో నడిచే రోజుల కోసం ఎదురు చూసి చూసి అలసిపోయిన నేపథ్యంలో ఇక ఈ చిత్రాన్ని విడుదల చేసేద్దామని ఫిక్సయినట్లున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 50 శాతం థియేటర్లు నిండినా చాలన్నట్లు ఉంది. అలా నిండాలంటే ‘టెనెట్’ లాంటి క్రేజీ మూవీస్ విడుదల కావాలి. ఈ సినిమా కరోనా టైంలోనే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విడుదలైంది. సినిమాకు చాలా మంచి టాక్ వచ్చినప్పటికీ.. లాక్ డౌన్ వల్ల ఆశించిన వసూళ్లయితే రాలేదు.
This post was last modified on November 23, 2020 8:22 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…