వేసవికి వెలుగుల్లేవు.. దసరా తేలిపోయింది.. దీపావళి ఆరిపోయింది.. కరోనా ధాటికి సినిమాలకు బాగా కలిసొచ్చే సీజన్లు నిస్సారంగా సాగిపోయాయి. సంక్రాంతికి హోరెత్తిపోయిన థియేటర్లు.. ఆ తర్వాత వెలవెలబోయాయి. ఏడు నెలల విరామం తర్వాత థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులైతే ఇచ్చింది కానీ.. చాలా వరకు థియేటర్లు మూతపడే ఉన్నాయి.
దసరాకో.. దీపావళికో థియేటర్లలో కాంతులు కనిపిస్తాయనుకున్నారు కానీ.. అలాంటి సంకేతాలేమీ లేకపోయాయి. ఇప్పుడిక క్రిస్మస్ మీద ఆశలు పెట్టుకున్నారు. చూస్తుండగానే నవంబరు నెలాఖరుకు వచ్చేశాం. ఇంకొన్ని రోజుల్లో డిసెంబర్లో అడుగు పెడతాం. కానీ క్రిస్మస్‌కైనా థియేటర్లన్నీ తెరుచుకుంటాయా.. 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయా అంటే సందేహంగానే ఉంది.
నిజానికి క్రిస్మస్ మీద నిర్మాతలకు మరీ పెద్ద ఆశలేమీ లేవు. అప్పటికి తమ సినిమాలు రిలీజ్ చేసేయాలన్న తొందరేమీ లేదు.
ప్రధానంగా వాళ్ల దృష్టి సంక్రాంతి మీదే ఉంది. ఒకటికి నాలుగు సినిమాలు ఆ సీజన్‌కు విడుదల ఖరారు చేసుకున్నాయి. అరణ్య, రంగ్‌దె, క్రాక్, రెడ్ సినిమాలను సంక్రాంతికి షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. క్రిస్మస్‌కు థియేటర్లు పూర్తి స్థాయిలో నడిస్తే అది ట్రయల్ పీరియడ్ లాగా ఉంటుంది. జనాలు థియేటర్లకు రావడం అప్పుడు మొదలైతే.. సంక్రాంతికి పూర్వపు పరిస్థితులు నెలకొని థియేటర్లలో సందడి నెలకొంటుందని ఆశించారు. కానీ ప్రస్తుతానికైతే ఆ దిశగా సంకేతాలు కనిపించడం లేదు.
పరిస్థితి ఆశాజనకంగా లేదు. మరి సంక్రాంతికి కూడా పరిస్థితులు బాగుపడకపోతే.. ఆ సీజన్‌కు విడుదల ఖరారు చేసుకున్న సినిమాల పరిస్థితి ఏంటి? ఆ నాలుగు సినిమాలకు తోడు ఇంకో అరడజనుకు పైగానే చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సంక్రాంతి మిస్సయితే వేసవి వైపు చూడాలి. కానీ దాన్ని టార్గెట్ చేసిన పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. వాటికి పెండింగ్‌లో ఉన్న సినిమాలు తోడవుతాయి. మరి ఇవన్నీ క్లియరవడానికి ఎంత సమయం పడుతుందో?
This post was last modified on November 22, 2020 5:41 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…