గత రెండు వారాలుగా ఇండస్ట్రీని కుదిపేసి ఎక్కడిక్కడ షూటింగులను ఆపేసిన ఫెడరేషన్ సమ్మె వివాదం రేపు పరిష్కారం కోసం చిరంజీవి ఇంటికి చేరనుందని ఫిలిం నగర్ అప్డేట్. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు, కార్మిక నాయకులు మెగాస్టార్ సమక్షంలో దీని గురించి చర్చించబోతున్నారు. ఎవరికి వారు తమ డిమాండ్ల మీద పట్టుదలగా ఉండటంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయ్యింది. ఫిలిం ఛాంబర్ లో ఒక మీటింగ్ జరిపినప్పటికీ ఎలాంటి కంక్లూజన్ కు రాలేకపోయారు. వాదోపవాదాలు తీవ్రంగా జరిగాయి తప్పించి ఏకాభిప్రాయం సాధించలేకపోయారు. పైపెచ్చు ఇంకా జఠిలం చేశారు.
ఇప్పుడు చిరంజీవి ఇరు వర్గాల మధ్య ఎలాంటి సంధి కుదురుస్తారనేది ఆసక్తికరంగా మారింది. నిర్మాతలేమో స్లాట్ల ప్రతిపాదన మీదే ధృడంగా ఉన్నారు. రోజుకు రెండు వేల రూపాయలు తీసుకునేవాళ్ళకు ఒక శాతం, వెయ్యి రూపాయలలోపు అందుకునే కార్మికులకు ఇంకో శాతం లాంటి కండీషన్లు ఫెడరేషన్ ముందు పెట్టారు. కానీ వాళ్లేమో దీనికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. గతంలో రాసుకున్న అగ్రిమెంట్లలో రెండు నిబంధనలు ఇప్పటికీ ఫెడరేషన్ పాటించడం లేదని ప్రొడ్యూసర్ల కంప్లయింట్. ఎప్పటి నుంచో అడుగుతున్నా పెంపు ఊసే లేకుండా పనులు చేయించుకుంటున్నారని ఫెడరేషన్ వాదన.
ఎంత పెద్దరికం తీసుకున్నా ఇది పరిష్కరించడం చిరంజీవికి అంత సులభమైతే కాబోదు. కాకపోతే ముందస్తు ప్రిపరేషన్ లో భాగంగా తనకు బాగా సన్నిహితులైన నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధుల నుంచి కావాల్సిన సమాచారాన్ని తెప్పించుకుని దాన్ని విశ్లేషించే పనిలో పడ్డారట. రేపు తన దగ్గరికి వచ్చినప్పుడు సహేతుకమైన వాదనలు, ప్రతిపాదనలు, సమాధానాలు ఉండేలా ప్రిపేరవుతున్నారని మెగా కాంపౌండ్ టాక్. ఇప్పుడీ రాయబారంలో చిరు విజయం సాధిస్తే అంతకన్నా ఇండస్ట్రీ కోరుకునేది ఏమి ఉండదు. ఇప్పటికే షూటింగుల బందు వల్ల లక్షల నష్టం క్రమంగా కోట్లకు చేరుకునే ప్రమాదం మొదలయ్యింది.
This post was last modified on August 16, 2025 10:09 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…