చాలా మాములు సన్నివేశాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నిలబెడతాడని అనిరుధ్ రవిచందర్ కు పేరు. జైలర్, దేవరలో దాన్ని నిజం చేసి చూపించాడు. రజనీకాంత్ ఊరికే నడుచుకుంటూ వచ్చే సీన్లను బీజీఎమ్ తో అదరగొట్టిన వైనం రిపీట్ ఆడియన్స్ ని తీసుకొచ్చింది. సెకండాఫ్ లో బలహీనతలున్న దేవర సైతం ఈ పాజిటివ్ ఫ్యాక్టర్ వల్లే నెగటివిటీని తట్టుకుని నిలబడింది. అలాంటి అనిరుధ్ ఇప్పుడు తడబడుతున్నాడు. వరసగా నాలుగు సినిమాలు తన పనితనానికి, తీసుకుంటున్న భారీ పారితోషికానికి మధ్య బ్యాలన్స్ ని ప్రశ్నిస్తున్నాయి. ఈ సమస్య గత ఏడాది విడుదలైన ‘వెట్టయన్’ నుంచి మొదలయ్యింది.
అందులో అనిరుధ్ మార్క్ అస్సలు కనిపించలేదు. సినిమా పెద్దగా ఏం లేదనే సంగతి పక్కనపెడితే మరీ బ్యాడ్ మూవీ అయితే కాదు. అయినా సరే బక్కోడి మేజిక్ పని చేయలేదంటూ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ఆ తర్వాత అజిత్ ‘విడాముయార్చి’ మరో చేదు అనుభవం. కంటెంట్ తేడాగా ఉన్నప్పటికీ అనిరుద్ స్టైల్ లో బిజిఎం, పాట ఏదీ పెద్దగా ప్రభావం చూపించలేదు. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ విషయంలోనూ ఊరికే ఊదరగొట్టడం తప్పించి మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఆల్బమ్, గుర్తు చేసుకునే నేపధ్య సంగీతం కానీ ఇవ్వలేదు. తాజాగా ‘కూలి’లోనూ మౌనిక మౌనిక తప్ప రజని ఇంట్రో సాంగ్ సైతం తేలిపోయింది.
అక్కడక్కడా తప్పించి అనిరుధ్ మార్క్ వినిపించలేదు. ఉన్నంతలో మంచి స్కోర్ ఇచ్చాడనే కామెంట్స్ ఉన్నాయి కానీ తన స్థాయి పనితనం కాదనే ,మాటను కొట్టిపారేయలేం. ఇతను చేస్తున్న సినిమాల్లో సెప్టెంబర్ 5 రిలీజ్ కానున్న శివ కార్తికేయన్ ‘మదరాసి’ ఉంది. దీంతో కంబ్యాక్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. నెక్స్ట్ రాబోతున్న వాటిలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మేజిక్, జన నాయగన్, ది ప్యారడైజ్, జైలర్ 2 చేతిలో ఉన్నాయి. షారుఖ్ ఖాన్ కింగ్ కూడా తనకే ఇచ్చారు. వీటితో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలనేది మ్యూజిక్ లవర్స్ డిమాండ్. కొంచెం హడావిడి తగ్గించి కంపోజింగ్ మీద ఎక్కువ దృష్టి పెడితే అదేం కష్టం కాదు.
This post was last modified on August 16, 2025 6:07 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…