Movie News

సెలబ్రిటీల శునక ప్రేమ మంచిదే… కానీ

ఢిల్లీ హైకోర్టు నగరంలో కుక్కల జాడ కనిపించడానికి వీల్లేదని, నిర్ణీత గడువు లోగా వాటిని షెల్టర్స్ కు తరలించాలని తీర్పు ఇవ్వడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. పలువురు సెలబ్రిటీలు ఈ చర్యను ఖండిస్తున్నారు. జయం హీరోయిన్ సదా ఏకంగా భోరున కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో విడుదల చేయగా జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, భూమి పెడ్నేకర్ తదితరులు సామజిక మాధ్యమాల ద్వారా న్యాయస్థానం తీర్పుకి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ జంతు ప్రేమ అర్థం చేసుకోదగినదే అయినా నెటిజెన్లు వాస్తవిక కోణంలో లేవనెత్తుతున్న కొన్ని ప్రశ్నలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.

సినీ తారలు మద్దతు ఇస్తున్న వీధి కుక్కల వల్ల నిత్యం ప్రమాదాల బారిన పడుతున్న పిల్లలు, వృద్ధులు, స్త్రీల సంఖ్య లక్షల్లో ఉంటోంది. కొందరు రేబీస్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా ఎందరో మానసిక సమస్యలతో పిచ్చోళ్లలా బ్రతుకుతున్నారు. ఈ రోజుకీ అర్ధరాత్రి దాటితే ఎన్నో నగరాలు, పట్టణాల్లో హఠాత్తుగా మనుషుల మీద దాడి చేసే కుక్కల వందలు వేలల్లో ఉంటాయి. హైదరాబాద్, బెంగళూరు లాంటి అభివృద్ధి చెందిన నగరాల్లోనూ ఈ బెడద తీవ్రంగా ఉంది. ఒక్క ఢిల్లీలోనే ఆరు లక్షల కుక్కలు ఉన్నట్టు ఒక అంచనా. సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే కోర్టు అలాంటి జడ్జ్ మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ముగ్గురు జడ్జీలతో దీన్ని మళ్ళీ పునఃసమీక్షించి కొత్త తీర్పు వెలువరించే అవకాశముందని ఢిల్లీ మీడియా రిపోర్ట్.

ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న సెలబ్రిటీలు ఎవరూ రాత్రి పూట టూ వీలర్స్ మీద వెళ్లడం కానీ, నడుచుకుంటూ వీధుల్లో తిరగడం కానీ చేయరు. ఇంట్లో ఎక్కిన కారు మళ్ళీ గమ్యస్థానం చేరుకున్నాకే దిగుతారు. విమానాలు, ఖరీదయిన వాహనాల్లో తిరిగే వీళ్లకు సగటు మనుషులు తింటున్న కుక్క కాట్లు రుచి చూసి ఉండరు. ఇంట్లో లక్షలు ఖరీదు చేసే ఫారిన్ బ్రీడ్లను పెంచుకుంటారు కానీ వీధి కుక్కలను తెచ్చి పెంచుకోరు. ఇవి నెటిజెన్ల అడుగుతున్న లాజిక్కులు. ప్రభుత్వాల బాధ్యత కుక్కల పట్ల ఎంత ఉన్నా జంతువులు మనుషుల కంటే ఖచ్చితంగా విలువైనవి కాదు. ఆ కోణంలో ఆలోచిస్తే వాస్తవాలు అర్థమవుతాయి.

This post was last modified on August 13, 2025 10:00 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

9 hours ago