బాలకృష్ణ కోసం క్రేజీ హీరోయిన్లను తీసుకురావాలని బోయపాటి శ్రీను చాలా ప్రయత్నించాడు. బాలీవుడ్ హీరోయిన్లను కూడా సంప్రదించాడు. అయితే కోవిడ్ కారణంగా ముంబయి హీరోయిన్లు దక్షిణాది సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. తెలుగు సినిమా చేస్తే హోటల్లో బస చేయాలి కనుక, అది ప్రమాదకరం కనుక హిందీ హీరోయిన్లు సౌత్ సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదు. దాంతో అందుబాటులో వున్న హీరోయిన్లతోనే చేయాలని బోయపాటి డిసైడ్ అయ్యాడు.
అందుకే అవుట్ డేటెడ్ అయిపోయిందనుకున్న ‘అవును’ ఫేమ్ పూర్ణను ఒక కథానాయిక పాత్రకు ఎంచుకున్నాడు. మరో యంగ్ క్యారెక్టర్‍కు మలయాళ నటి ప్రయాగ మార్టిన్‍ను తీసుకుంటే ఆమె బాలయ్య సరసన మరీ చిన్నపిల్లలా అనిపించడంతో తీసేసారని వార్తలొచ్చాయి. ఆమె స్థానంలో ‘అఖిల్’ హీరోయిన్ సయ్యేషాను ఎంచుకుంటే ఇప్పుడు ఆమె కూడా వాకౌట్ చేసిందని చెబుతున్నారు.
దీంతో ఆ పాత్రకు ముందుగా అనుకున్నట్టుగా ప్రగ్యా జైస్వాల్‍నే ఖరారు చేసుకున్నారని తెలిసింది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‍కి హీరోయిన్ ఎవరయినా ఫరక్ పడదు కనుక ఫైనల్‍గా ఎవరు నటించినా ఆ పాయింట్‍ని ఎవరూ కేర్ చేయరు.
Gulte Telugu Telugu Political and Movie News Updates