మళ్లీ మరోసారి ‘ఢీ’

ఏనాటి నుంచో వినిపిస్తోంది ఢీ సినిమాకు సీక్వెల్. మంచు విష్ణు నోట చాలా సార్లు వినిపించింది కానీ మెటీరియలైజ్ కాలేదు. ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్టు సెట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇది సీక్వెల్ మాదిరిగా వుండదు. సెపరేట్ కథతో సెపరేట్ సినిమాగా వుంటుంది. ఢీ అనే టైటిల్, శ్రీనువైట్ల, మంచు విష్ణు మాత్రమే కామన్ విషయాలు.

ఈవారంలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ రాబోతోంది. ప్రస్తుతం మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో చాలా ప్రాజెక్టులు వున్నాయి. మోసగాళ్లు, భక్త కన్నప్ప, మోహన్ బాబు కీలకపాత్రలో ఓ సినిమా. ఇలా చాలా వున్నాయి. వాటితో పాటే ఈ సినిమాను కూడా విష్ణునే నిర్మిస్తారు.

ఢీ సినిమా విషయంలో అప్పట్లో దర్శకుడు శ్రీనువైట్లకు బొలెడు మంది సాయం పట్టారు. పైగా ప్రస్తుతం శ్రీనువైట్ల అస్సలు ఫామ్ లో లేరు. వరుస డిజాస్టర్లు ఇచ్చి ఖాళీగా వున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి మరోసారి ఢీ అనేందుకు ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేసారో? ఎలా వుంటుందో చూడాలి.