నిన్న టాలీవుడ్ నిర్మాతల బృందం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ని కలిసింది. అందరూ అనుకున్నట్టు ఇది ఫెడరేషన్ సమ్మె గురించి కాదు. తాజా పరిణామాలతో పాటు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశం ఏర్పాటు చేయమని అడిగేందుకు టాప్ ప్రొడ్యూసర్లు అమరావతికి వెళ్లారు. ప్రత్యేక ఎజెండా ఏమి లేకపోయినా వర్తమానంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పలు అంశాల గురించి ఇందులో చర్చించుకున్నారు. సుమారు రెండు గంటలకు పైగానే ఈ భేటీ జరగ్గా పలు కీలకమైన విషయాల గురించి కూలంకుషంగా మాట్లాడుకున్నారట.
తెలంగాణలో ఇటీవలే గద్దర్ అవార్డులు ప్రకటించి వాటిని విజేతలకు అందజేశారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి కూడా నంది అవార్డులను తిరిగి మొదలుపెట్టాలనే ప్రతిపాదన పలు సందర్భాల్లో వచ్చింది. ఉమ్మడిగా ఇవ్వాలా లేక విడిగా నిర్వహించాలా అనే దాని గురించి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయట. అమరావతి ప్రాంతంలో స్టూడియోలు, ఫిలిం సిటీల నిర్మాణానికి కావాల్సిన స్థలాలు, వనరుల గురించి దుర్గేష్, నిర్మాతల మధ్య డిస్కషన్ జరిగింది. టికెట్ రేట్లకు సంబంధించి ఒక స్థిరమైన వ్యవస్థ తీసుకురావాలనే ప్రతిపాదన మీటింగ్ లో వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సినిమా వాడిగా తమ సమస్యలు బాధలు అన్నీ తెలిసిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే వెంటనే సిఎం కలవలేకపోయామని చెప్పిన నిర్మాత నాగవంశీ త్వరలోనే చంద్రబాబునాయుడుని కలిసి తమ పరిస్థితులు వివరిస్తామని అన్నారు. సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో ఏర్పాటు చేసేలా కందుల దుర్గేష్ నుంచి హామీ వచ్చిందని మీడియా టాక్. నిజానికి రెండు నెలల క్రితం ప్లాన్ చేసుకున్న ఈ సమావేశం వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ ఎట్టకేలకు నిన్న కుదిరింది. అయితే చంద్రబాబు, పవన్ తో జరగబోయే భేటీ ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వనుంది. ఏపీలో పరిశ్రమ అడుగుకు పునాది వేయనుంది. దీనికి చొరవ తీసుకునేది పవన్ కల్యాణే.
This post was last modified on August 12, 2025 12:00 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…