Movie News

త్రిశంకు స్వర్గంలో టాలీవుడ్ షూటింగులు

ఫిలిం ఫెడరేషన్ 30 శాతం పెంపు కోరుతూ సమ్మెకు పిలుపు ఇవ్వడం, దానికి ఫిలిం ఛాంబర్ స్పందించి స్లాట్ల విధానాన్ని ప్రతిపాదించడం, దానికి తిరస్కారం ఎదురవ్వడం, తదితర పరిణామాలు సోమవారం నుంచి ఏకంగా షూటింగుల బందుకు తీసుకెళ్లాయి. పెంపుకి ఒప్పుకున్న నిర్మాతలు సైతం ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విషయంలో ఛాంబర్ పెద్దలు పట్టుదలగా ఉండటంతో అందరూ ఏకీభావంతో ఉన్నారు. అటుపక్క ఫెడరేషన్ సైతం మంకుపట్టు వీడటం లేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తరహాలో టాలీవుడ్ రోడ్ బ్లాక్ అయిపోయింది. బయటికి దారి తెలియడం లేదు.

ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో ఒక బృందం, తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మరో టీమ్ కలిసి సమస్యలు విన్నవించుకున్నా ఎలాంటి హామీ లభించలేదనేది ఇప్పటికి ఉన్న సమాచారం. ఇద్దరు మంత్రులు ఫెడరేషన్, ఛాంబర్ కలిసి సామరస్యంగా కమిటీలు వేసుకొని మాట్లాడుకుని పరిష్కరించుకోండి అని సంకేతాలు ఇవ్వడంతో బాల్ కాస్తా ప్రొడ్యూసర్లు, వర్కర్ల చేతికి వచ్చింది. షూటింగులు ఆపేయడం భావ్యం కాదని ఈ సందర్భంగా కోమటిరెడ్డి పేర్కొన్నారు. మధ్యలో పెద్దగా వ్యవహరించి దీన్నో కొలిక్కి తీసుకొద్దామనే చొరవ సీనియర్ల నుంచి జూనియర్ల దాకా ఎవరూ పెద్దగా చూపకపోవడంతో ప్రాబ్లమ్ మరింత జఠిలంగా మారింది.

ఇప్పటికే సెప్టెంబర్, అక్టోబర్ రిలీజులు ఒత్తిడిలో దిగిపోయాయి. విడుదల తేదీలను చేరుకోవాలంటే ఇప్పుడు షూటింగులు ఆగకూడదు. ఆర్టిస్టుల డేట్లు మళ్ళీ దొరకవు. చేతిలో ఉన్న బడ్జెట్ అయిపోవచ్చు. ముఖ్యంగా ప్యాన్ ఇండియా సినిమాలకు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉండబోతోంది. ఛాంబర్ పెద్దలు శతవిధాలుగా దీన్ని సాల్వ్ చేసేందుకు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు కానీ సొల్యూషన్ ఎలా దొరుకుతుందో అర్థం కాక తల పట్టేసుకుంటున్నారు.. ఇరు వర్గాలు ఏదో ఒక పాయింట్ దగ్గర కాంప్రమైజ్ అయితే తప్ప ఇది కొలిక్కి రావడం కష్టం. అప్పటిదాకా ఎదురు చూడటం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమీ లేదు.

This post was last modified on August 12, 2025 11:32 am

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

1 hour ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

2 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

2 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

3 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

3 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

4 hours ago