టాలీవుడ్ ఒకరకమైన గడ్డు స్థితిని ఎదురుకుంటోంది. ఒకపక్క స్టార్ హీరోల సినిమాలు మూడో రోజే చేతులు ఎత్తేస్తున్నాయి. టయర్ , టయర్ 2 కథానాయకులు థియేటర్లకు ఆక్సీజెన్ ఇస్తారనుకుంటే బ్రేక్ ఈవెన్ కే కష్టపడాల్సి రావడం ఊహించని పరిణామం. ఇంకోవైపు ఫెడరేషన్ ఇచ్చిన సమ్మె పిలుపుతో ఎక్కడి షూటింగులు అక్కడే ఆగిపోయి నిర్మాతల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు కానీ ఖచ్చితంగా అంతే టైంలో అనేది చెప్పలేం. స్వయంగా చిరంజీవి, బాలకృష్ణలు రంగంలోకి దిగుతున్నారు కాబట్టి సొల్యూషన్ ఎలా ఉండబోతోందో చూడాలి.
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో వరదలను తలపించే వరుణ దేవుడి భీభత్సానికి జనాలు భీతిల్లుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో సైతం జనం బయటికి రాలేనంత జల్లులు పెద్ద పరీక్ష పెడుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే థియేటర్ ఆక్యుపెన్సీల ఆశించడం జరగని పని. ఒక్క మహావతార్ నరసింహ మాత్రమే అంచనాలకు మించి ఫుల్స్ చేయిస్తోంది. కానీ మిగిలినవి మాత్రం ఖర్చులు కిట్టుబాటు చేసేందుకు నానా కష్టాలు పడుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇండస్ట్రీ చాలా డ్రై పీరియడ్ ని చూస్తోంది.
అసలే వచ్చే వారం రెండు పెద్ద రిలీజులున్నాయి. వార్ 2, కూలిల మీద ఏపీ తెలంగాణ కలిపి నూటా యాభై కోట్లకు పైగా వ్యాపారాలు ఆధారపడి ఉంన్నాయి. వర్షాలు తగ్గిపోయి పరిశ్రమ సమస్యలు కొలిక్కి వస్తే థియేటర్లతో పాటు షూటింగ్ లో ఉన్న ప్రొడక్షన్ హౌసులు ఊపిరి పీల్చుకుంటాయి. నిర్మాతలు టెన్షన్ తో తల బద్దలు కొట్టుకుంటున్నారు. రోజువారీ సమావేశాలతో సతమతమవుతున్నారు. రిలీజ్ కు దగ్గరలో ఉన్న చాలా సినిమాలు డెడ్ లైన్ మీటవ్వాలంటే షూట్స్ ఆగకూడదు. లేదంటే మళ్ళీ ఓటిటిలు, ఎగ్జిబిట్లర్లతో లేనిపోని తలనెప్పి వస్తుంది. ఇంకేమేం జరగబోతున్నాయో వేచి చూడాలి.
This post was last modified on August 7, 2025 10:54 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…