ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలంటే మినిమం గ్యారెంటీ అన్నట్లుండేది. సినిమాకు టాక్ ఎలా ఉన్నా.. భారీగా ఓపెనింగ్స్ వచ్చేసేవి. దీంతో బయ్యర్ల పెట్టుబడులు ఈజీగా రికవర్ అయిపోయేవి. చాలా వరకు స్టార్ల సినిమాలు సేఫ్ ప్రాజెక్టుల్లా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. స్టార్ హీరోల సినిమాలు బడ్జెట్లు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. బిజినెస్ ఆశించిన మేర జరగట్లేదు. ఒకవేళ జరిగినా.. రికవరీ కష్టం అయిపోతోంది. సినిమాకు టాక్ తేడా వస్తే వీకెండ్లోనే సినిమా చతికిలబడుతోంది. వసూళ్లు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు.
గతంలో స్టార్ల సినిమాలకు పోటీగా వేరే చిత్రాలను రిలీజ్ చేయడానికి భయపడేవాళ్లు. అలా రిలీజ్ చేసినా ఆ పెద్ద సినిమాల ముందు ఇవి నిలబడలేకపోయేవి. కానీ ఇప్పుడు మాత్రం స్టార్ల సినిమాలు రేసులో ఉన్నప్పటికీ.. కంటెంట్ బలంగా ఉన్న చిన్న చిత్రాలు పెద్ద సినిమాలను దెబ్బ కొడుతుండడం గమనార్హం.
రెండేళ్ల కిందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘బ్రో’ను ‘బేబి’ అనే చిన్న సినిమా దెబ్బ తీసింది. కొత్త సినిమా అయిన ‘బ్రో’ వీకెండ్ తర్వాత డౌన్ అయిపోగా.. ముందు వారం రిలీజైన ‘బేబి’ దాన్ని మించి వసూళ్లు రాబట్టింది. క్రమంగా ‘బ్రో’కు థియేటర్లకు తగ్గించి ‘బేబి’కి పెంచిన పరిస్థితి. ఇక గత ఏడాది సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’.. ‘హనుమాన్’ అనే సినిమా ముందు నిలవలేకపోయింది. మహేష్ సినిమా నుంచి థియేటర్లను తీసి ‘హనుమాన్’కు ఇచ్చారు. క్రమంగా వసూళ్లు పెంచుకుంటూ పోయిన ‘హనుమాన్’ ఊహించని స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.
‘గుంటూరు కారం’ వారం రెండు వారాలు తిరిగేసరికే థియేటర్ల నుంచి లేచిపోగా.. ‘హనుమాన్’ నెల రోజుల పాటు ఆడింది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి మిడ్ రేంజ్ మూవీ జోరు ముందు ‘గేమ్ చేంజర్’ లాంటి భారీ చిత్రం నిలవలేకపోయింది. వర్తమానంలోకి వస్తే.. ‘మహావతార నరసింహ’ అనే యానిమేషన్ మూవీ.. పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ను ఓడించేసింది. పవన్ సినిమా జోరు వీకెండ్‌కు పరిమితం అయింది. ఆ తర్వాత అంతా ఈ కన్నడ అనువాద చిత్రానిదే జోరు. దాని ప్రభావం ‘కింగ్డమ్’ మీద కూడా పడింది.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే.. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేయవు. కంటెంట్ ఉన్న చిన్న చిత్రాల ముందు పెద్ద సినిమాలు కూడా దిగదుడుపే. ఈ విషయాన్ని గ్రహించి నిర్మాతలు స్టార్లు, కాంబినేషన్ల వెంట పడడం కంటే కంటెంట్ మీద దృష్టిపెడితే మంచిది.
This post was last modified on August 6, 2025 6:06 pm
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…