కెమెరా ముందుకు వెళ్లబోతున్నా అనగానే మెగాస్టార్ చిరంజీవిలో ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుందో ఏమో.. అందుకోసం ఆయన సన్నద్ధమయ్యే తీరే ప్రత్యేకంగా ఉంటుంది. రాజకీయాలు, ఇతర వ్యవహారాల వల్ల పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరు.. ఆ సమయంలో తన లుక్ గురించి పెద్దగా పట్టించుకున్నది లేదు. కానీ ‘ఖైదీ నంబర్ 150’తో రీఎంట్రీ ఇవ్వాలనుకున్నపుడు కొన్ని నెలల్లోనే ఆయన తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ఆ సినిమాలో అమేజింగ్ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు.
పదేళ్ల పాటు చిరు సినిమాలకు దూరంగా ఉన్న ఫీలింగ్ ఎంతమాత్రం కలగలేదు. చివరగా ‘శంకర్ దాదా జిందాబాద్’లో ఎంత ఆకర్షణీయంగా కనిపించారో.. రీఎంట్రీ మూవీలో అంతే అట్రాక్టివ్‌గా కనిపించారు. మధ్యలో ‘సైరా’ కోసం లుక్ మార్చుకుని విభిన్నంగా కనిపించిన చిరు.. మళ్లీ ‘ఆచార్య’ కోసం అవతారం మార్చుకున్నారు.
ఆ మధ్య రిలీజైన ‘ఆచార్య’ ఫస్ట్ లుక్‌లో చిరును చూసి కొందరికి సాయిధరమ్ తేజ్ గుర్తుకొచ్చాడు. అంతగా చిరు ఫిజిక్‌లో మార్పు వచ్చింది. ఐతే లాక్ డౌన్ టైంలో షూటింగ్ లేక చిరు ఖాళీ అయిపోయాడు. మధ్య మధ్యలో ఆయన లుక్ తేడా కొడుతున్నట్లు కనిపించింది. కానీ షూటింగ్ మళ్లీ మొదలు కాబోతోందనగానే చిరులో మళ్లీ మార్పు వచ్చేసింది. కష్టపడి ఒకప్పటి లుక్‌లోకి వచ్చేశారు.
తాజాగా సమంత ‘ఆహా’ కోసం నిర్వహిస్తున్న టాక్ షో ‘సామ్ జామ్’కు అతిథిగా వచ్చిన సందర్భంగా చిరు చేసిన ఫొటో షూట్ తాలూకు పిక్స్ బయటికి వచ్చాయి. అందులో చిరును చూసి అందరూ షాకైపోయారు. టాప్ టు బాటమ్ ఆయనలో ఒక ఆకర్షణ కనిపిస్తోంది. ముఖంలో తేజస్సు చూసి అందరూ షాక్. ఓవరాల్‌గా లుక్ చాలా బాగుందనే ఫీడ్ బ్యాక్ అందరిలోనూ వచ్చింది. కెమెరా అంటే చిరులో ఎంత ఉత్సాహం వస్తుందో.. ఎలా లుక్‌ను ఆకర్షణీయంగా మార్చుకుంటారో మరోసారి రుజువైంది.
This post was last modified on November 19, 2020 7:21 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…