బడ్జెట్లు పెరిగిపోయి.. వసూళ్లు తగ్గిపోయి.. సక్సెస్ రేట్ పడిపోయి.. ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లాభాల సంగతి అటుంచితే.. పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తేనే హమ్మయ్య అనుకునే పరిస్థితి. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయింది.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేసింది అని సంబరపడడం నిజమే కానీ.. సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయి నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ఇలాంటి టైంలో తెెలుగు ఫిలిం ఫెడరేషన్ సమ్మెకు పిలుపునివ్వడం మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లే చెప్పాలి.
సినీ కార్మికులకు 30 శాతం మేర పారితోషకాలు పెంచాలంటూ రెండు రోజుల కిందట స్ట్రైక్‌కు పిలుపునిచ్చింది ఫెడరేషన్. దీనిపై టాలీవుడ్ నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. షూటింగ్స్ ఆగిపోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఐతే స్ట్రైక్‌కు భయపడి పారితోషకాలు పెంచితే అది నిర్మాతలకు చాలా భారం అవుతుంది.
ఈ నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ డిమాండ్లకు లొంగకూడదని నిర్మాతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఫెడరేషన్‌తో సంబంధం లేకుండా వివిధ సినీ విభాగాలకు సంబంధించి ప్రతిభావంతులు ఎవ్వరైనా నేరుగా తమను సంప్రదించవచ్చని పిలుపునిచ్చారు. ఫెడరేషన్‌కు లక్షల్లో డబ్బులు కట్టాల్సిన పని లేదని చెబుతున్నారు. ఇందుకోసం వెబ్ సైట్ కూడా ఓపెన్ చేశారు.
సమ్మె వల్ల కొన్ని రోజులు ఇబ్బంది పడ్డా సరే.. ఇలా నేరుగా తమను సంప్రదించిన వారితోనే పని చేయించుకోవాలని నిర్ణయించారు. ఇది ఫిలిం ఫెడరేషన్‌కు ఇబ్బందికర పరిణామమే. ఇదే ధోరణి కొనసాగితే.. ఫెడరేషన్ మనుగడే ప్రమాదంలో పడొచ్చు. కాబట్టి సమ్మె విరమించక తప్పని పరిస్థితి నెలకొంటుందని భావిస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో చివరికి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
This post was last modified on August 6, 2025 8:03 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…