సుషాంత్ సింగ్ రాజ్‍పుట్ మరణించడంలో రియా చక్రవర్తి పాత్ర ఏమిటనేది ఎవరికీ తెలియదు. దానిపై మీడియా పలు రకాల కథనాలు ప్రచారం చేసింది. దానికి ఆజ్యం పోస్తూ సుషాంత్ కుటుంబం ఆమెను దోషిగా చూపించింది. అయితే ఆమెకు సిబిఐ ఎంక్వయిరీలో ఈ విషయంపై క్లీన్ చిట్ లభించింది. అయినప్పటికీ రియాను దోషిగా భావిస్తోన్న వారు చాలా మందే వున్నారు.
సుషాంత్ మరణవార్త ఇప్పుడు మరుగున పడిపోయినా కానీ ఆ మరక పూర్తిగా చెరిపేసుకుని రియా మునుపటిలా తన కెరియర్ కొనసాగించడం అంత సులభం కాదు. సినిమాల సంగతి అటుంచి కనీసం సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టాలన్నా కూడా ట్రోలింగ్‍కి భయపడాలి. సోషల్ మీడియా ట్రోలింగ్‍కి మహామహులే అకౌంట్లు డిలీట్ చేసుకుని వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తితో సినిమా తీయడానికి ఎవరు సాహసిస్తారు.
ఇప్పుడు తనకు అవకాశం ఇచ్చిన ఏ పెద్ద నిర్మాణ సంస్థకు అయినా సుషాంత్ మరణంలో వారి పాత్ర కూడా వుందనే అపవాదులు తప్పవు. అందుకే తనతో సినిమా తీసేందుకు ఏ బడా సంస్థ ధైర్యం చేయకపోవచ్చు. ఆమె తమ సినిమాలో వుంటే ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని భావించే చిన్న నిర్మాతలు ఈ స్థాయి ట్రోలింగ్‍ను తట్టుకుని సినిమాను విడుదల చేస్తారనే నమ్మకం లేదు. ఈ ఫ్యాక్టర్ వల్ల రియా చక్రవర్తికి ఓటిటి నుంచి కూడా అవకాశాలు రాకపోవచ్చు.