ఎప్పుడెప్పుడాని ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసిన ఓజి ప్రమోషన్లలో కీలక ఘట్టం ఇవాళ మొదలైపోయింది. ఫైర్ వర్క్స్ పేరుతో తమన్ కంపోజ్ చేసిన మొదటి సాంగ్ యూట్యూబ్ లోకి వచ్చేసింది. తెలుగు, ఇంగ్లీష్, జపనీస్ మూడు భాషల పదాలు పొందుపరిచి చేసిన వెరైటీ ప్రయోగం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా యానిమేషన్ల రూపంలో సినిమాలోని కొన్ని కీలక యాక్షన్ సీన్లను చూపించి చూపించకుండా రివీల్ చేసిన విధానం బాగుంది. బైక్ మీద కత్తితో వెళ్తూ విలన్ల కార్లు బ్లాస్ట్ చేసి ఆ మంటల ముందు స్టైల్ గా పవన్ కళ్యాణ్ కూర్చుంటాడని సెట్ చేసిన షాట్ సినిమాలో చూస్తే గూస్ బంప్స్ ఖాయం.
విశ్వ – శ్రీనివాస మౌళి తెలుగు లిరిక్స్ అందించగా రాజకుమారి ఇంగ్లీష్, అద్వితీయ వొజ్జల జపాన్ సాహిత్యం సమకూర్చారు. ఫాస్ట్ బీట్స్ లో పగ రగిలిన పైరు కలబడితే గుండెల్లో ఫియరూ అంటూ క్యాచీ పదాలతో చేసిన ప్రయోగాలు బాగున్నాయి. హోరెత్తిపోయే డ్రమ్స్, వాయిద్యాలతో తమన్ పక్కా డీజే సాంగ్ ఇచ్చేశాడు. అయితే ఇది దేవి కంపోజ్ చేసిన గబ్బర్ సింగ్ రేంజ్ కు వెళ్తుందా అంతకు మించి ఉంటుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా దర్శకుడు సుజిత్ విజువల్స్ పరంగా తీసుకున్న శ్రద్ధ క్వాలిటీ అవుట్ ఫుట్ వచ్చేలా చేసింది. పాట హిట్టయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది.
ఇక సెప్టెంబర్ 25 విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని మేకర్స్ మరోసారి ఈ పాట ద్వారా స్పష్టం చేశారు. వీడియో చివర్లో డేట్ వేశారు. అఖండ 2 కూడా అదే రోజు వస్తున్న నేపథ్యంలో వాయిదా గురించి పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ వాటికి చెక్ పెట్టేశారు. ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే ఓజి విడుదలకు సరిగ్గా 54 రోజులు మాత్రమే ఉంది. ఇకపై పబ్లిసిటీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళబోతున్నారు. హరిహర వీరమల్లు వచ్చిన రెండు నెలలకే రెండో పవన్ కళ్యాణ్ సినిమా రావడం అభిమానులు మొదటిసారి ఎక్స్ పీరియన్స్ చేయబోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates