కన్నడ కథానాయకుడు దర్శన్.. తన అభిమానే అయిన రేణుక స్వామి అనే వ్యక్తిని తన బృందంతో కలిసి దారుణంగా హింసించి హత్య చేయించినట్లు అభియోగాలు ఎదుర్కోవడం గత ఏడాది ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. కారణాలు ఏవైనా కానీ.. రేణుకస్వామిని దర్శన్ అండ్ కో హింసించిన తీరు ఘోరాతి ఘోరం. తన గాయాలు, అనుభవించిన చిత్రహింస గురించి మీడియాలో వచ్చిన వార్తలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. ఈ హత్యలో దర్శన్ స్వయంగా పాల్గొన్నట్లు ఆధారాలు ఉండడంతో అతను జైలు పాలయ్యాడు. ఐతే ఆరు నెలలు తిరిగేసరికే అతను రెగ్యులర్ బెయిల్ మీద బయటికి వచ్చేశాడు.
ఈ హత్య చేయించింది దర్శనే అని.. స్వయంగా అతనే రేణుకాస్వామిని హింసించాడని ఆధారాలున్నా… ఎఫ్ఐఆర్‌లో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నా.. దర్శన్‌కు బెయిల్ రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ఇప్పుడు ఇదే విషయమై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు బెయిట్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం మందలించింది.
దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై స్పందిస్తూ.. ప్రాథమిక న్యాయ అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అని పేర్కొంది. హైకోర్టు అన్ని కేసుల్లో ఇలాగే చేస్తుందా.. ఈ కేసును ప్రత్యేక దృష్టితో చూసిందా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు ఉపయోగించిన భాష మీద సుప్రీం కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నిందితుడు హత్య చేసినట్లు సరైన ఆధారాలు లేవని ఎలా అంటారని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు చేసిన తప్పును తాము చేయబోమని.. ఈ కేసు విషయంలో తీవ్రంగా ఉంటామని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలను బట్టి చూస్తే త్వరలో దర్శన్ బెయిల్ రద్దవుతుందనే చర్చ జరుగుతోంది.
This post was last modified on July 25, 2025 3:01 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…