పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెట్లో తొలిప్రేమ హీరోయిన్ అనగానే.. కీర్తి రెడ్డి ఆయనతో రీ యునైట్ అవుతోందా, ఇదేం చిత్రం అనిపించొచ్చు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆయనతో కలిసి నటిస్తున్నది 1998 ‘తొలి ప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డి కాదు.. 2018లో వచ్చిన వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’ కథానాయిక రాశి ఖన్నా. ఈ ఢిల్లీ భామ తొలిసారిగా పవన్ కళ్యాణ్‌తో జట్టు కడుతున్న సంగతి ఇప్పటికే సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఇప్పుడా విషయం అధికారికం అయింది. పవన్ కొత్త చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఒక కథానాయికగా శ్రీలీల నటిస్తుండగా.. రెండో హీరోయిన్‌గా రాశిని సెలక్ట్ చేసింది చిత్ర బృందం. ఆమె ఈ సినిమాలో శ్లోక అనే పాత్రలో కనిపించనుంది.
మెడకు కెమెరా తగిలించుకుని స్కర్టుతో చాలా మోడర్న్‌గా కనిపిస్తున్న రాశి ఫస్ట్ లుక్‌ను ఈ రోజు చిత్ర బృందం రిలీజ్ చేసింది. రాశి తెలుగులో చాన్నాళ్ల తర్వాత ఓ పెద్ద హీరో సరసన నటిస్తున్న చిత్రమిది. ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసి టాప్ హీరోయిన్ అయ్యే దిశగా అడుగులు వేసిన రాశికి.. అనుకోకుండా బ్రేక్ వచ్చింది. వరుస ఫ్లాపులతో ఆమె వెనుకబడిపోయింది. ఒక దశలో తెలుగులో సినిమాలే లేని పరిస్థితి వచ్చింది. ఐతే కొంత విరామం తర్వాత ఆమెకు సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుగు కదా’ చేసే అవకాశం వచ్చింది.
ఇప్పుడు ఏకంగా పవన్‌తో సినిమా చేసే ఛాన్స్ అందుకుంది రాశి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తమిళ బ్లాక్ బస్టర్ ‘తెరి’కి రీమేక్ అని భావిస్తూ వచ్చారు. కానీ ఈ మధ్య ఒరి ఇరిజినల్ స్టోరీతో తెరకెక్కుతున్న సినిమానే అంటూ ప్రచారం మొదలైంది. రీమేకే అయితే.. తమిళంలో సమంత, అమీ చేసిన పాత్రల్లో రాశి, శ్రీలీలల్లో ఎవరు ఏ పాత్రను చేస్తున్నారన్నది ఆసక్తికరం. ఒరిజినల్లో సమంతకే కీలక పాత్ర దక్కింది. ఆమెది నటనకు అవకాశమున్న పాత్ర. అనుభవం, యాక్టింగ్ టాలెంట్ ప్రకారం చూస్తే రాశికే ఆ పాత్ర దక్కాలి. మరి హరీష్ శంకర్ ఎవరిని ఈ పాత్రకు ఎంచుకున్నాడో చూడాలి. అసలింతకీ ఈ చిత్రం రీమేకా కాదా అన్నది పెద్ద సస్పెన్స్.
This post was last modified on July 22, 2025 1:15 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…