అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో రూపొందుతున్న ఫాంటసీ మూవీకి సంబంధించిన లీకులు చాలా క్రేజీగా అనిపిస్తున్నాయి. దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ లతో ఇప్పటికే క్యాస్టింగ్ కలర్ ఫుల్ గా ఉండగా త్వరలో భాగ్యశ్రీ బోర్సేని కూడా తీసుకోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. ఇందులో మరో ముఖ్యమైన లేడీ విలన్ క్యారెక్టర్ కు రష్మిక మందన్న ఓకే చెప్పిందనే వార్త ముంబై మీడియాలో జోరుగా తిరుగుతోంది. బన్నీ, అట్లీతో పాటు లాస్ యాంజిల్స్ వర్క్ షాప్ లో పాల్గొన్న శ్రీవల్లికి తనకు ఆఫర్ చేసిన పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉన్నా ఎగ్జైట్ మెంట్ అనిపించడంతో ఓకే చెప్పిందట.
అయితే అందరూ అనుకుంటున్నట్టు ఇదేదో రెగ్యులర్ గా హీరో చేతిలో దెబ్బలు తినే లేదా చనిపోయే పాత్ర కాదట. నెగటివ్ టచ్ ఉన్న మాట నిజమే అయినప్పటికీ కంటెంట్ పరంగా పెర్ఫార్మన్స్ కు చాలా స్కోప్ ఉండటంతో ఫ్యాన్స్ ఫీలవ్వలేని విధంగా అట్లీ ఆమె బ్లాక్స్ ని డిజైన్ చేసినట్టు తెలిసింది. మరో ముగ్గురికి ఎక్కువ ప్రాధాన్యం దక్కి తనను డామినేట్ చేసే రోల్స్ కు రష్మిక మందన్న అంత సులభంగా ఒప్పుకోదు. ఇది సూపర్ హీరో జానర్ కాబట్టి నమ్మశక్యం కానీ పాత్రలు ఏఏ 22లో చాలా ఉంటయి. రెగ్యులర్ డ్యూయెట్లు, లవ్ సీన్లు, మాస్ అంశాలకు దూరంగా పెద్ద స్కేల్ లో అట్లీ ఆవిష్కరించబోతున్న అద్భుతమిది.
సో ప్రస్తుతానికి రష్మిక మందన్న అభిమానులు పెద్దగా టెన్షన్ పడనక్కర్లేదు. క్రిష్ 3లో కంగనా రౌనత్ లాగా ఈమెను చూడాల్సి వస్తుందేమోననే భయం అక్కర్లేదని యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న ఈ క్రేజీ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ని లీకుల రూపంలో బయటికి రావడం నిత్యం డిస్కషన్ జరిగేలా చేస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ కు అత్యధిక ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కే ఆరేడు నెలల సమయం అవసరం పడుతుందట. అందుకే విడుదల తేదీ గురించి ఎలాంటి క్లూస్ ఇవ్వడం లేదు. అంతా సవ్యంగా జరిగితే 2027 సంక్రాంతికి చూడొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates