విజయ్ దేవరకొండ కింగ్డమ్ హిందీ థియేటర్ వెర్షన్ రిలీజ్ చేయడం లేదనే ప్రచారం నిన్నంతా బాగానే తిరిగింది. అయితే ప్రస్తుతం ఈ నిర్ణయంలో మార్పు జరిగిందని లేటెస్ట్ అప్డేట్. నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఓటిటి గ్యాప్ నెల రోజులకే తీసుకున్న సితార సంస్థ ఆ కారణంగానే ఉత్తరాది మల్టీప్లెక్సుల్లో విడుదల చేసే అవకాశాన్ని కోల్పోయింది. గతంలో ఈ కండీషన్ వల్లే నాని హిట్ 3 ది థర్డ్ కేస్, విజయ్ లియో లాంటి పెద్ద సినిమాలు సింగల్ స్క్రీన్లతో సర్దుకుని పని పూర్తి చేసుకున్నాయి. లైగర్ హిట్టయ్యి ఉంటే రౌడీ బాయ్ కు అక్కడ మార్కెట్ దొరికేది. కానీ ఆలా జరగకపోవడంతో ఆ మార్కెట్ ని సీరియస్ గా తీసుకోవడం లేదు.
ఇప్పటికైతే కింగ్డమ్ అలియాస్ సామ్రాజ్య (హిందీ టైటిల్) కేవలం సింగల్ స్క్రీన్లలోనే వస్తుంది. కొన్ని నెలలుగా పలు వాయిదాల వల్ల ఆలస్యమైన ఈ ప్యాన్ ఇండియా మూవీ జూలై 31 ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావడానికి ఛాన్స్ లేదు. ఆ మేరకు ఓటిటి డీల్ అయిపోయిందట. హరిహర వీరమల్లు వచ్చిన వారానికే రావాల్సి వస్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంత తక్కువ గ్యాప్ తో క్లాష్ కు సిద్ధ పడుతున్నారు. ఇంకో వారం లో ప్రమోషన్లు ఊపందుకోబోతున్నాయి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చివరి దశ పనుల్లో బిజీగా ఉండగా అనిరుద్ రవిచందర్ ఇంకో పది రోజుల్లో రీ రికార్డింగ్ పూర్తి చేసి ఇవ్వొచ్చని ఫిలిం నగర్ టాక్.
ఏది ఏమైనా బాలీవుడ్ రిలీజ్ మీద ఇలాంటి సినిమాలు ఎక్కువ ఆశలు పెట్టుకోకపోవడం మంచిదే. డిజిటల్ లో మిడ్ రేంజ్ తెలుగు సినిమాలు చూసేందుకు ఎగబడుతున్న నార్త్ ఆడియన్స్ ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, కాంతార, పుష్ప లాంటి గ్రాండియర్లకు మాత్రమే మినహాయింపు ఇచ్చి థియేటర్లలో చూస్తున్నారు. కింగ్డమ్ కూడా ఇదే క్యాటగిరీ అయినప్పటికి శ్రీలంక శరణార్థులు, సాయుధ పోరాటం తదితర బ్యాక్ డ్రాపులు వాళ్లకు కనెక్ట్ కావడం అంత సులభం కాదు. అందుకే హిందీ మల్టీప్లెక్సుల కోసం రిస్కులు చేయడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన కింగ్డమ్ లో సత్యదేవ్ ఓ ముఖ్యపాత్ర పోషించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates