సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ కమిటైన సినిమాలు రెండు. ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి కాంబినేషన్ లో చేయనున్న మెగా 157 ఒకటి కాగా, ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే ఎంటర్ టైనర్ రెండోది. ఆరు నెలల నుంచి వెంకీ మామ రెస్ట్ మోడ్ లో ఉన్నారు. ఇప్పుడు అమెరికా పర్యటన పూర్తి చేసుకుని ఇంకో వారంలో ఇండియా రాబోతున్నారు. విచ్చేయగానే బిజీ చేసేంత షెడ్యూల్స్ రెడీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ మూవీకి వెంకటరమణ టైటిల్ దాదాపు ఫిక్సని టాక్. క్యాప్షన్ గా కేరాఫ్ ఆనందనిలయం ఉంటుందట.
నువ్వు నాకు నచ్చావ్ స్టైల్ లో రూపొందబోయే ఈ వినోదాత్మక చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని లేటెస్ట్ లీక్. నిధి అగర్వాల్ దాదాపు ఓకే చెప్పిందట. హరిహర వీరమల్లు ప్రమోషన్లు, ది రాజా సాబ్ షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే మకాం వేసిన నిధిని ఇటీవలే త్రివిక్రమ్ కలవడం, స్టోరీ నెరేషన్ వగైరా ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని అంటున్నారు. ఒప్పందం కాగానే అధికారిక ప్రకటన రూపంలో రావొచ్చు. మరో హీరోయిన్ గా త్రిష పేరు పరిశీలనలో ఉందట. వెంకటేష్ – త్రిష కాంబోతో గతంలో నమో వెంకటేశా, బాడీగార్డ్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వచ్చాయి. ఒకటి యావరేజ్, రెండోది ఫ్లాప్, చివరిది బ్లాక్ బస్టర్ కొట్టింది.
సో మళ్ళీ రిపీట్ చేయడం బాగానే ఉంటుంది. చిరంజీవి, మోహన్ లాల్, కమల్ హాసన్, విజయ్ లాంటి సీనియర్ స్టార్ల పక్కన వరసగా ఆఫర్లు కొట్టేస్తున్న త్రిష నాలుగు పదుల వయసులోనూ డిమాండ్ కొనసాగిస్తోంది. పది కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందనే టాక్ ఉంది కానీ ఎంతవరకు నిజమో నిర్మాతలకే తెలుసు. వీలైతే ఇదే నెలలో మొదలుపెట్టాలని చూస్తున్న వెంకటేష్ – త్రివిక్రమ్ మూవీకి ముహూర్తం ఎప్పుడనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆరేడేళ్ల నుంచి పెండింగ్ లో ఉంటూ వస్తున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తోంది. వెంకీ మార్కు కామెడీ టైమింగ్ తో మాటల మాంత్రికుడు ఎలాంటి మేజిక్ చేయబోతున్నారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates