కన్నప్ప విడుదలైపోయింది. ఆధ్యాత్మిక అంశాలతో పాటు ప్రేక్షకుల్లో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం హీరోయిన్ ప్రీతీ ముకుందన్. నిజానికి ఈమెది తక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రనుకున్నారు. ఎందుకంటే ప్రమోషన్లలో ఎక్కడా కనిపించకపోవడం, మంచు విష్ణు ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం లాంటి కారణాలు దానికి దోహదం చేశాయి. తీరా సినిమాలో చూస్తే స్పేస్ ఎక్కువే దొరికింది. ఒక గూడెం మహారాణి కూతురిగా పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మంచు విష్ణుతో రెండు రొమాంటిక్ సాంగ్స్ తో పాటు నటిగా ప్రూవ్ చేసుకునేందుకు మూడు మంచి ఎపిసోడ్స్ పడ్డాయి. వాటిని నిలబెట్టింది కూడా.
ఆశ్చర్యకరంగా ప్రీతీ ముకుందన్ వైపు నుంచి కన్నప్పకు ప్రమోషన్ల పరంగా ఎలాంటి సపోర్ట్ లేకపోవడం వింతే. ఈవెంట్లలో కూడా తనను ఎక్కువ తీసుకురాలేదు. కొన్ని నిముషాలు కనిపించే మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లు హైలైట్ అయినంతగా ప్రీతీకి ప్రాధాన్యం దక్కలేదు. వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయో లేక కన్నప్ప బృందం తన విషయాన్ని లైట్ తీసుకుందో ప్రస్తుతానికి సస్పెన్సే. ట్విస్ట్ ఏంటంటే తనకిది మొదటి తెలుగు సినిమా కాదు. శ్రీవిష్ణు ఓం భీం బుష్ తో ఎంట్రీ ఇచ్చింది. అది డీసెంట్ సక్సెస్ అందుకుంది కానీ ఈమెకు పేరు వచ్చిన దాఖలాలు లేవు.
కన్నప్పకు అలా కాదు. ఆడియన్స్ ప్రీతీ ముకుందన్ ని గుర్తు పెట్టుకుంటున్నారు. గ్లామర్ యాంగిల్ లోనే కావొచ్చు మరిన్ని అవకాశాలు రావడానికి ఇది దోహదపడుతుంది. ప్రస్తుతం తను మలయాళంలో మైనే ప్యార్ కియాతో పాటు తమిళ మూవీ ఇదయం మురళిలో నటిస్తోంది. గత ఏడాది తమిళంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన స్టార్ లో తనే హీరోయిన్ గా నటించింది. ఇవి తప్ప ప్రీతీ కొత్తగా ఒప్పుకున్న కమిట్ మెంట్స్ అయితే లేవు. కోలీవుడ్ టాక్ ప్రకారం ఆఫర్లు వస్తున్నా తనే ఒప్పుకోవడం లేదట. ఎందుకో గాని దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత మర్చిపోకుండా ఉంటే బెటర్.
Gulte Telugu Telugu Political and Movie News Updates