మెగాస్టార్ చిరంజీవి కరోనా కథ అనూహ్య మలుపు తిరిగింది. నాలుగు రోజుల కిందట తనకు కరోనా వచ్చినట్లు ప్రకటించిన చిరు.. ఇప్పుడు అది నిజం కాదని తేల్చాడు. తనకు అసలేమాత్రం కరోనా లక్షణాలు లేకపోవడంతో తిరిగి వేర్వేరు మార్గాల్లో పరీక్షలు చేయిస్తే.. తనకు కరోనా నెగెటివే వచ్చిందని.. మొదట తాను పరీక్షకు వినియోగించిన కరోనా కిట్‌లో లోపం ఉందని తేలిందని.. తనకసలు కరోనా సోకకున్నా అది వైరస్ ఉన్నట్లు చూపించిందని చిరు స్పష్టం చేశాడు. ఈ సమాచారం అందరినీ విస్మయానికి గురి చేసింది.
కరోనా సోకినట్లు వెల్లడించడానికి ముందు చిరు.. మాస్కుల్లేకుండా అక్కడా ఇక్కడా తిరిగేసిన ఫొటోలు పెట్టి ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేశారు జనాలు. ఆయనకు కరోనా లేకున్నప్పటికీ అలా చేయడం తప్పే కానీ.. కరోనా పాజిటివ్ అని చెప్పడం వల్ల చిరు విపరీతంగా ట్రోల్‌కు గురయ్యాడు.
ఆ సంగతలా వదిలేస్తే కరోనా కిట్‌లలో లోపాల గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ర్యాపిడ్ కిట్ల కచ్చితత్వంపై ముందు నుంచి సందేహాలున్నాయి. కరోనా లేని వారికి ఉన్నట్లు, ఉన్నవారికి లేనట్లు చూపిస్తున్నాయన్నది వీటి మీద వచ్చిన విమర్శ. ఇప్పుడు చిరంజీవి కాబట్టి అనుమానంతో వేర్వేరు మార్గాల్లో మళ్లీ పరీక్ష చేయించుకున్నాడు. తన కోడలి కుటుంబం ఆధ్వర్యంలో నడిచే అపోలో హాస్పిటల్లో ఒక బృందమే ఆయన కోసం పని చేసింది. సీటీ స్కాన్ ద్వారా, కచ్చితమైన కరోనా పరీక్షల ద్వారా ఆయనకు వైరస్ సోకలేదని నిర్ధరించింది.
కానీ ఆ స్థానంలో ఒక సామాన్యుడు ఉంటే ఏంటన్నది ప్రశ్న. కరోనా లేకున్నా ఉన్నట్లు చూపితే, ఉన్నా లేనట్లు చూపిస్తే పరిస్థితి ఏంటి? కరోనా ఆరోగ్య పరంగానే కాక సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా జనాలపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తోందో తెలిసిందే. అలాంటపుడు ఇలా తప్పుడు ఫలితాలు రావడంతో జరిగే నష్టమెలాంటిదన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో కరోనా కిట్ల కచ్చితత్వంపై రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on November 13, 2020 11:28 am
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…