హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యవహరించడం.. దుస్తులు, చెప్పుల వంటి వాటి మీద అసభ్యకరంగా హిందూ దేవుళ్ల ఫొటోలను చిత్రించడం.. విదేశాల్లో తరచూ జరిగే వ్యవహారమే. ఇలాంటి వాటి మీద ఇండియన్స్ తీవ్రంగానే స్పందిస్తున్నారు ఈ మధ్య. అయినా ఇలాంటివి ఆగట్లేదు. ఐతే మన సంస్కృతి గురించి ఏమీ తెలియని విదేశీయులు ఇలాంటివి చేశారంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ భారతీయ మూలాలు ఉన్న వాళ్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డం టూమచ్. కెనడాకు చెందిన టామీ జెనెసిస్ ఇలాంటి పనే చేసింది.
పేరు చూసి ఆమెకు ఇండియాతో కనెక్షన్ లేదనుకోవడానికి వీల్లేదు. ఆమె తండ్రి ఇండియన్, పైగా హిందువు. తన తల్లి స్వీడన్ దేశానికి చెందిన క్రిస్టియన్. ఐతే తన లేటెస్ట్ రాప్ సాంగ్‌లో ఇటు హిందూ, అటు క్రిస్టియన్ మతస్థులు ఇద్దరినీ కించపరిచేలా వ్యవహరించిందన్నది టామీ జెనెసిస్ మీద వచ్చిన ఆరోపణ. తన పాటలో హిందూ దేవుళ్ల ఆహార్యాన్ని తలపించే మేకప్ వేసుకుని అసభ్యకరమైన నృత్యాలు, సంజ్ఞలు చేసింది టామీ జెనెసిస్.
అంతే కాక ఈ పాట మధ్యలో క్రిస్టియన్లు ఎంతో పవిత్రంగా భావించే క్రాస్‌ను కూడా పట్టుకుని చాలా ఇబ్బందికరమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో టామీ మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కళ పేరుతో మత సంబంధిత విషయాల్లోకి దూరిపోయి జనాల మనోభావాలను దెబ్బ తీయడం ఫ్యాషన్ అయిపోయిందని.. ఇలాంటి వారిని తేలికగా వదిలిపెట్టకూడదని నెటిజన్లు మండిపడుతున్నారు. క్రిస్టియన్స్ సైతం టామీ చర్యను తప్పుబడుతున్నారు. వెంటనే ఆ పాటను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. టామీ తండ్రి దశాబ్దాల క్రితమే కెనడాలో స్థిరపడ్డాడు. ఆయన తల్లిదండ్రులు వృత్తిలో భాగంగా కెనడాకు వెళ్లిపోయారు.
This post was last modified on June 23, 2025 8:00 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…