Movie News

30 కోట్ల నష్టం నమ్మే విషయమేనా

కర్ణాటకలో థగ్ లైఫ్ విడుదలకు కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక కమల్ హసన్ బృందానికి కించిత్ ఆనందం కూడా లేదు. ఎందుకంటే తెలుగు తమిళంలో ఇప్పటికే డిజాస్టర్ టాక్ తో ఫైనల్ రన్ కు వచ్చేసిన ఈ సూపర్ ఫ్లాప్ ఇప్పటికిప్పుడు శాండల్ వుడ్ లో అద్భుతాలు చేసే ఛాన్స్ సున్నా. పైగా హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్ నేనిప్పుడు రిలీజ్ చేయలేనని, పోటీ సినిమాలు ఎక్కువగా ఉన్నాయని,  ఒకవేళ ఎవరైనా ముందుకొస్తే తన అడ్వాన్సులు వెనక్కు ఇచ్చి ప్రొసీడ్ అవ్వొచ్చని చెప్పడంతో కథ కంచికి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఇప్పటికే తమిళ వెర్షన్ కు సంబంధించిన హెచ్డి ప్రింట్లు ఆన్ లైన్లో హల్చల్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కర్ణాటక రిలీజ్ ఆగిపోవడం వల్ల తమకు 30 కోట్ల నష్టం వాటిల్లిందని కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కుమార్ ఇంటర్నేషనల్ చెప్పినట్టుగా చెన్నై మీడియాలో వస్తున్న వార్తలు విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే విడుదల ఆగిపోయిన మాట నిజమే కానీ మరీ ఇంత వసూలు చేసే మ్యాటర్ థగ్ లైఫ్ లో లేదన్నది వాస్తవం. ఒకవేళ ఈ వివాదం లేకుండా సాఫీగా తమిళ, తెలుగు, హిందీతో పాటు కన్నడలో కూడా రిలీజై ఉంటే మహా అయితే పది కోట్ల లోపే గ్రాస్ వచ్చేదని ట్రేడ్ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ముప్పై కోట్ల నష్టం అనే ప్రశ్న ఉత్పన్నం కాదనేది వాళ్ళ వెర్షన్.

ఏది ఏమైనా ఇండియన్ 2ని మించిన డిజాస్టర్ మూటగట్టుకున్న కమల్ హాసన్ థగ్ లైఫ్ కోసం చేసిన ప్రమోషన్లు, పెట్టిన ఖర్చు, పబ్లిసిటీ కోసం తిరిగిన ఊళ్లు, శ్రమను మర్చి ఇచ్చిన పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఇప్పట్లో ఈ గాయం మానేలా లేదు. ఇంకో వైపు మణిరత్నం సైతం ఈ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. పొన్నియిన్ సెల్వన్ ఆయనను ఎంతో కొంత ఫామ్ లోకి తిరిగి తీసుకొచ్చింది. కానీ థగ్ లైఫ్ పుణ్యమాని ఏకంగా ట్రోలింగ్ బారిన పడ్డారు. ఇప్పుడు శింబు సోలో హీరోగా చేయబోయే సినిమాతో అయినా కంబ్యాక్ అవుతారో లేదో అనేది కాలమే సమాధానం చెప్పాలి.

This post was last modified on June 19, 2025 11:06 pm

Share

Recent Posts

అన్నగా ఫెయిల్.. మామగా ఫెయిల్.. సీఎంగా ఫెయిల్

ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు ఏపీ మాజీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.…

57 minutes ago

తెలుగు కుర్రాళ్ల దెబ్బ… కివీస్‌ అబ్బా

టీమ్ఇండియాకు మరోసారి బ్యాటర్లే విజయాన్ని అందించారు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఒక…

1 hour ago

గాడ్ ఆఫ్ వార్… త్రివిక్రమ్ తొలి పలుకులు

ఇప్పటిదాకా త్రివిక్రమ్ శ్రీనివాస్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, యాక్షన్ సినిమాలే తీశాడు. తన సమకాలీన దర్శకులు, తనకంటే జూనియర్లు…

2 hours ago

బురకాలు వేసుకునివచ్చి మిలిటెంట్లుగా వ్యవహారిస్తున్నారు

స్థానిక ఎన్నికలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీ ఏదో ఒక లిటిగేషన్ సృష్టించడమే కాకుండా చీటికీ మాటికీ కోర్టుకు…

2 hours ago

హనుమంతరావు మాటలకు బాధపడ్డ బాబు

“ఆంధ్రాలో ఎన్నికలంటే కొట్టుకుంటారని, తెలంగాణలో అలా ఉండదని” హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి…

3 hours ago

కాయితంకి కలిసి వస్తున్న వివాదాలు

చిన్న సినిమాలకు మార్కెటింగ్ చేసుకుని ఓపెనింగ్స్ వచ్చేలా ప్రేక్షకులని ప్రభావితం చేయడం నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారిపోయింది. దీంతో…

6 hours ago