మెగా 157ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తీరు చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి మూడో దానికి రంగం సిద్ధం చేస్తున్న ఈ మెట్రో స్పీడ్ డైరెక్టర్ అనుకున్న దానికన్నా చాలా ముందుగా గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. ఇటీవలే చిరంజీవి, నయనతార, క్యాథరిన్ త్రెస్సా, బుల్లిరాజు తదితరుల మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు పూర్తి చేసిన రావిపూడి అసలైన భాగం కోసం రంగం సిద్ధం చేస్తున్నాడు. చిరు, వెంకటేష్ కాంబోలో వచ్చే సీన్లు, ఎపిసోడ్లకు వచ్చే నెల నుంచి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిసింది. డేట్లు ఫైనలయ్యాయి కానీ బయటికి రాలేదు.
అతను తీసేవి కామెడీ కమర్షియల్ ఎంటర్ టైనర్లే కావొచ్చు. కానీ క్వాలిటీ తగ్గకుండా, వేగం మిస్ కాకుండా మైంటైన్ చేస్తున్న స్థిరత్వం ఖచ్చితంగా ఒక పాఠం లాంటిది. ప్యాన్ ఇండియా ట్రాప్ లో పడి సంవత్సరాల తరబడి విలువైన కాలాన్ని వృథా చేస్తున్న కొత్త దర్శకులు తన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 2023లో ఒక చిన్న సినిమాతో తొంభై కోట్ల గ్రాసర్ ఖాతాలో వేసుకున్న డెబ్యూ డైరెక్టర్ ఇప్పటిదాకా ఇంకో మూవీ మొదలుపెట్టలేదు. హిందీ రీమేక్ అంటూ టైం వేస్ట్ చేసుకున్నాడు. అంతకు ముందు కరోనా టైంలో జాతీయ అవార్డు సాధించిన కల్ట్ మూవీ తీసిన ఇంకో కుర్ర దర్శకుడు పద్దెనిమిది నెలల తర్వాత మెగా ఫోన్ పట్టుకున్నాడు.
ఇంత గ్యాప్ లో చాలా సినిమాల్లో నటుడిగా కనిపించాడు తప్ప డైరెక్టర్ గా ఎలాంటి దూకుడు చూపించలేదు. మొన్నటి ఏడాది ఎమోషనల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన మరో సెన్సిటివ్ దర్శకుడు వేరే టయర్ 1 స్టార్ కోసం రెండేళ్లు ఎదురు చూసి తిరిగి తన డెబ్యూ హీరో దగ్గరికే చేరుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకు అంతం ఉండదు. అందుకే అనిల్ రావిపూడి టాలీవుడ్ లీగ్ లో చాలా స్పెషల్ గా నిలుస్తున్నాడు. 2026 సంక్రాంతికి మెగా 157 విడుదల చేసే తీరుతానని శపథం చేసిన రావిపూడి ఆ మాటను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాడు.
This post was last modified on June 19, 2025 10:05 pm
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…