డిజిటల్ ని చిన్న చూపు చూడొద్దు!

డిజిటల్ రైట్స్ నుంచి థియేటర్ల నుంచి వచ్చే రెవిన్యూ రాకపోవచ్చు కానీ డిజిటల్ మార్కెట్ కి ఉన్న రీచ్ థియేటర్ రిలీజ్ కి ఉండదు. ఎంత పెద్ద సినిమా అయినా థియేటర్స్ లో వస్తే పర భాషా ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లి చూడరు. అదే ఓటిటీ లో అందుబాటులో వుంటే ఏ భాష సినిమా అయినా బాగుందంటే తప్పకుండా చూస్తారు. మన అర్జున్ రెడ్డి దేశ వ్యాప్తంగా అలాగే ఫేమస్ అయింది.

ఉత్తమ కథ ఉన్న కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి సినిమాలకు కూడా డిజిటల్ రీచ్ బాగా వచ్చింది. హిందీ సిరీస్ కి ఎక్కువ ఆడియన్స్ ఉంటారని, అందుకని వాళ్ళు ఖర్చు పెడుతున్నారని అనుకోవడం పొరపాటు. కంటెంట్ బాగుంటే ఏ భాషలో వచ్చినా చూస్తారు. ఒక్కసారి క్వాలిటీ కంటెంట్ కి అలవాటు చేస్తే నెక్స్ట్ చేసే దానికోసం ఎదురు చూస్తారు.

మనకి రీచ్ తక్కువ కాబట్టి తక్కువ శ్రేణి కంటెంట్ తీయాలని, సెక్స్ సీన్లు పెట్టి ఒక వర్గం ప్రేక్షకులని ఆకట్టుకోవాలని చీప్ గా ఆలోచిస్తున్నారు. సెక్స్ ఒక్కటే కాదు కంటెంట్ క్వాలిటీ వుంటే అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకోవచ్చు. పెద్ద నిర్మాతలైన కొంత కాలం లాభాపేక్షకి పోకుండా వుంటే చిన్న వాళ్ళకి కూడా ధైర్యం వచ్చి కంటెంట్ మీద దృష్టి పెడతారు.