వెండితెరపై పెద్దగా రొమాన్స్ చేయని హీరోల్లో ప్రభాస్‌ను ఒకడిగా చెప్పుకోవాలి. ఒకప్పుడైనా లవ్ స్టోరీలు, రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలు చేసేవాడు కానీ.. ‘బాహుబలి’తో తన ఇమేజ్ ఆకాశానికి చేరిపోయాక ప్రభాస్ సినిమాల్లో రొమాన్స్ డోస్ బాగా తగ్గిపోయింది. ‘రాధేశ్యామ్’ను మినహాయిస్తే తన చిత్రాల్లో ఈ మధ్య రొమాంటిక్ యాంగిలే కనిపించదు. స్వయంగా ప్రభాసే ఈ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నాడట. ఇదే విషయాన్ని దర్శకుడు మారుతి దగ్గర కూడా ప్రస్తావించాడట.
‘రాజాసాబ్’లో వీలైతే ఇద్దరు హీరోయిన్లను పెట్టగలవా అని ప్రభాస్ సరదాగా తనను అడిగినట్లు మారుతి నిన్నటి టీజర్ లాంచ్ ఈవెంట్లో చెప్పడం విశేషం. ‘సలార్’, ‘కల్కి’ చిత్రాల్లో తనకు హీరోయిన్ ఉన్నా లేనట్లే అని.. ‘ఆదిపురుష్’లో తనకు జోడీగా ఉన్నది సీత పాత్ర కావడంతో అక్కడా రొమాన్స్ లేదని.. నిజ జీవితంలోనూ తన జీవితంలో హీరోయిన్ లేని నేపథ్యంలో ‘రాజా సాబ్’లో ఇద్దరు హీరోయిన్లను పెట్టమని ప్రభాస్ అడిగితే.. ఇద్దరేంటి ముగ్గురిని పెడదాం అని ఆ ప్రకారమే చేసినట్లు మారుతి వెల్లడించాడు.
ప్రభాస్ అడగడం, మారుతి పెట్టడం ఏమో కానీ.. ‘రాజా సాబ్’లో గ్లామర్ డోస్ గట్టిగానే ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. గ్లామర్ క్వీన్స్‌గా పేరున్న నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌లతో పాటు ఇప్పటిదాకా చిన్న సినిమాలే చేసిన రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. టీజర్లో ఈ ముగ్గురూ బాగానే గ్లామర్ ఒలకబోశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో నిరంతరం సెక్సీ ఫొటో షూట్లతో కుర్రకారును కవ్విస్తూ ఉండే మాళవిక మోహనన్.. ఒక సీన్లో పొట్టి నిక్కరుతో చాలా గ్లామరస్‌గా కనిపించింది.
సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన మాళవికను తెలుగు సినిమాల్లో చూడాలని మన కుర్రాళ్లు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. తన తొలి తెలుగు చిత్రంలో తన ఇమేజ్‌కు తగ్గ పాత్రే పోషిస్తున్నట్లుంది మాళవిక. నిధి సైతం ఆమెకు పోటీగా అందాలు చిందించింది. చాలా ఆకర్షణీయంగా కనిపించింది. సినిమాలో ఆమెనే లీడ్ హీరోయిన్‌లా కనిపిస్తోంది. రిద్ధి కుమార్ ఒక్క ఫ్రేమ్‌లోనే కనిపించినా.. ఆమె కూడా చాలా హాట్‌గానే కనిపించింది. టీజర్ చూశాక సినిమాలో కావాల్సినంత రొమాన్స్ ఉంటుందని.. కుర్రాళ్లను థియేటర్లకు రప్పించడంలో హీరోయిన్లూ కీలక పాత్ర పోషిస్తారని స్పష్టమైంది.
This post was last modified on June 17, 2025 10:10 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…